డ్వాక్రా మహిళల అభివృద్దికి చంద్రబాబు కృషి
గుంటూరు,అక్టోబర్13(జనంసాక్షి): డ్వాక్రా మహిళల పట్ల ముందునుంచి సిఎం చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని టిడిపి ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రాలకు ప్రాణం పోసింది సిఎం చంద్రబాబునాయుడన్నారు. వారిని ఆర్థికగా నిలిపి ఎన్నో విధాలుగా ఆదుకున్నారని చెప్పారు. వారు ఆర్థికంగా ఎదగడం ద్వారా సవ్యం సమృద్ది సాధించాలని కోరుకుంటున్నారని, అయితే విపక్ష వైకాపా నేతలకు ఇది కూడా జీర్ణం కావడం లేదన్నారు. 2014 ఎన్నికల హావిూలో భాగంగా డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేసేందుకు తెదేపా హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం మూడు విడతల్లో ఒకొక్క సభ్యురాలికి రూ.10వేల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఒక సంఘంలో కనిష్టంగా పది మంది సభ్యులు ఉంటారు. ఈ సంఘానికి రూ.10వేల చొప్పున రూ.లక్ష వరకు రుణమాఫీ కానుంది. దీన్ని మూడు దశల్లో వర్తింప చేయాలని నిర్ణయించారు. తొలివిడత 30శాతం నిధులను విడుదల చేశారు.త్వరలో ఈ నిధులు ఆయా సంఘాల ఖాతాలో జమకానున్నాయి. గత 25 ఏళ్లుగా ఈసంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. మహిళా సాధికారిత కోసం తాను కృషి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మహిళలకు దాదాపు రూ.341కోట్ల మేరకు లబ్ధిచేకూరింది. దాదాపు 1.15 సంఘాలకు నిధులు విడుదలయ్యాయి. ఒక్కొక్కరికి రూ.3వేల ఆర్థిక సహాయం అందనుంది. ఇప్పటికే రుణం చెల్లించిన వారికి ఈ మొతం వ్యక్తిగతంగా అందించనున్నారు. బకాయి ఉన్నవారికి రుణంలో మినహాయింపు ఇవ్వనున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం రూ.57వేల సంఘాలు ఉన్నాయి. రుణ మాఫీ కింద సుమారు రూ.575 కోట్ల వరకు జిల్లాకు అందనున్నాయి. గుంటూరు జిల్లాలో దాదాపు 58వేల సంఘాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం రూ.600 కోట్లు మహిళా సంఘాలకు లబ్ధిచేకూరనుందని జివి అన్నారు.