ఢల్లీి సీఎంపై దుండగుడి అనూహ్యదాడి

` వినతిపత్రం ఇస్తూ రేఖాగుప్తా చెంపపై కొట్టిన వ్యక్తి
` నిందితుడు రాజ్‌కోట్‌కుచెందిన వాడిగా గుర్తింపు
` దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీ సీఎం అతిషి
న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ యువకుడు దాడి చేశాడు. బుధవారం ఉదయం సివిల్‌ లైన్స్‌లోని సిఎం అధికారిక నివాసంలో జరిగిన జన్‌ సున్వై కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి. నిందితుడిని సంఘటనా స్థలం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మొదట ముఖ్యమంత్రికి ఫిర్యాదుగా ఒక పత్రాన్ని అందజేసి, ఆపై ఆమెపై దాడి చేసినట్లు- బిజెపి నాయకుడు ఒకరు తెలిపారు. సిఎం రేఖ గుప్తాపై జరిగిన దాడిని ఢల్లీి బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండిరచారు. ఢల్లీి కాంగ్రెస్‌ చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌ కూడా ఈ దాడిని ఖండిరచారు. ఈ సంఘటనను దురదృష్టకరం అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి మొత్తం ఢల్లీికి నాయకత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. ఢల్లీి సిఎం భద్రతను కూడా యాదవ్‌ ప్రశ్నించారు. ఈ సంఘటన మహిళల భద్రతను కూడా బహిర్గతం చేస్తుంది. ఢల్లీి సిఎం సురక్షితంగా లేకపోతే, ఒక సామాన్యుడు లేదా సాధారణ మహిళ ఎలా సురక్షితంగా ఉంటారు? అని దేవేందర్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఢల్లీి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు అతిషి బుధవారం ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడిని ఖండిరచారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు- లేదని అతిషి అన్నారు. ఢల్లీి ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి అత్యంత ఖండిరచదగినది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుంది. కానీ హింసకు చోటు లేదు. నిందితులపై ఢల్లీి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
రాజ్‌కోట్‌కుచెందిన వ్యక్తిగా గుర్తింపు
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడి చేయడం సంచలనం రేపింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌ భాయ్‌ ఖివ్జిూ భాయ్‌ సకారియాగా (41) గుర్తించారు. గుజరాత్‌లోనూ అతడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు దాడికి గల కారణాలు తెలుసుకొనే పనిలో పడ్డారు. ఈసందర్భంగా అతడి కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ముఖ్యమంత్రిపై సకారియా ఎందుకు దాడి చేశాడనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతడిని విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వచ్చినట్లు- వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండిరగులో ఉందని జాతీయ విూడియాలో కథనాలు వచ్చాయి. అయితే, వీటిని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.మరోవైపు గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు, ఆమె నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కుమారుడు దిల్లీ సీఎంను కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లు- సమాచారం. అతడు జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని పేర్కొన్నట్లు- తెలుస్తోంది. అయితే, అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, గతంలోనూ ఓసారి దిల్లీకి వెళ్లి వచ్చాడని పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఇదిలాఉంటే, దిల్లీ సివిల్‌ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం ఉదయం ’జన్‌ సున్‌వాయ్‌’ నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై రాజ్‌కోట్‌ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత అతడు గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేసినట్లు- ప్రత్యక్ష సాక్షులు విూడియాకు వెల్లడిరచారు. ఈ ఘటనను భాజపా సహా విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిరచాయి.