ఢిల్లీలో గాంధీజీకి ఘన నివాళి
న్యూఢిల్లీ: మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్ నేత అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గోన్నారు.