ఢిల్లీలో దీక్షతో చంద్రబాబు డ్రామాలు

– నాలుగున్నరేళ్లు లేనిది.. ఎన్నికల సమయంలో దీక్షలా?
– వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తాం
– కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ¬దా సాధిస్తాం
– వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్‌. ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు ఢిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్ష కేవలం ప్రజల్లో సానుభూతికోసమేనని, నాలుగున్నరేళ్లు గుర్తుకు రాని దీక్ష.. చంద్రబాబుకు ఎన్నికల సమయంలో గుర్తుకు
రావడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబు ఢిల్లీ దీక్ష కేవలం డ్రామా అని కొట్టిపారేశారు. సీఎం చంద్రబాబు ఎవరిని మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 2016లో ¬దా వద్దు.. ప్యాకేజీ కావాలని అడిగారని, ఇప్పుడు ప్రజల డబ్బుతో ఢిల్లీలో పోరాటం చేయడం ఏంటని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌, ¬దా, పోర్ట్‌ నిర్మణాల కోసం ఢిల్లీ వెళ్లి మోడీని ఏనాడైనా ఆడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బకాయిలు కట్టాలని ఎన్‌టీపీసీ నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజా అవసరాల కోసం డబ్బు వినియోగించకుండా.. దుబారా చేస్తున్నారని మండిపడ్డ  పడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని సుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక విమానాల కోసం, పార్టీ కార్యక్రమాల కోసం ప్రజల డబ్బు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు కరెంట్‌ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు దోచిపెట్టడానికే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. రూ.3లక్షల కోట్లు అప్పులు చేశారని, ఒక్క ప్రాజెక్టు అయిన పూర్తి చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఏ పట్టణం, ఏ పల్లె పోయినా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయారని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసం ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. రాబోయే రోజుల్లో  ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెప్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అత్యధిక స్థానాలను సాధిస్తామని, తద్వారా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ¬దాను సాధిస్తామని స్పష్టంచేశారు.