ఢిల్లీ వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా బసవ జ్యోతి కార్యక్రమం

జహీరాబాద్  జులై 16 (జనం సాక్షి )బసవతత్వము ఒక వారసత్వ సంపద అని అంబేద్కర్ ఆశయాన్ని పూర్తి చేయడం కోసం అందరం కలిసి కృషి చేయాలని ముఖ్య వక్తగా ప్రసంగించిన సయ్యద్ మక్సూద్ అన్నారు.జహీరాబాద్ పట్టణంలో స్థానిక బసవేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 654వ బసవ జ్యోతి కార్య క్రమానికి ఆశ్రయదాతగా స్థానిక సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ వ్యవహరించగా ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా సామాజికవేత్త, బహుజన రచయిత, సయ్యద్ మక్సూద్ హాజరై ఆయన మాట్లాడుతూ 800 సంవత్సరాల క్రితం సమసమాజ స్థాపనకై విశ్వగురు బసవేశ్వరుడు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఆధునిక తరానికి ఆదర్శనీయమన్నాడు, సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు వచన సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం నింపిన బసవేశ్వరుడు ఒక విప్లవకారుడని కొనియాడారు, తను స్థాపించిన అనుభవం మంటపం ద్వారా యావత్తు భారతదేశ సమాజానికి ఒక దిశా నిర్దేశం చేసే ప్రయత్నం బసవేశ్వరుడు చేశాడని అన్నారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమ ఆశ్రయదాత అయిన ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ నేటి 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో జరుపుకుంటున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భావిభారత నిర్మాణానికి బసవేశ్వరుడు ఒక దిక్సూచి అని చెబుతూ నాటి రాజ్యాంగ రచనలో కర్ణాటక కు చెందిన నిజ లింగప్ప బసవేశ్వరుని గూర్చి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు వివరించి చెప్పిన లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేవని బసవేశ్వరుని కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం చేయకూడదని అంబేద్కర్ కోరిన ఆశయాన్ని జహీరాబాద్ లింగాయత్ సమాజ్ బహుజన నేతలు ఇతర పౌర సమాజం తమ బాధ్యతను ఎత్తుకోవాలని ఇందుకోసం తనవంతుగా సహకారం అందిస్తానని ఢిల్లీ వసంత్ అన్నారు, బసవేశ్వరుడు కర్ణాటక కు చెందిన ఒక వారసత్వ సంపద అయితే సమీపాన ఉన్నటువంటి జహీరాబాద్ వాసులుగా ఆ వారసత్వ సంపాదనని పట్టా మార్పు లాగా పొందాలని పిలుపునిచ్చాడు,ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు రాజశేఖర్ షెట్కర్ రాష్ట్రీయ బసవదల్ అధ్యక్షులు శంకర్ పాటిల్ సోమశేఖర్ పాటిల్ , స్థానిక సమాజ్ నాయకులు బసవరాజు మడపతి, సాయి రెడ్డి విట్టల్ రెడ్డి, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ జనార్దన్, రైతు సంఘం నాయకులు బిల్లిపురం మాధవ రెడ్డి, జిల్లా లింగాయత్ సమాజ్ బాధ్యులు మధుశేఖర్, ప్రధాన కార్యదర్శి అనిమిశెట్టి జయప్రకాష్, నారాయణఖేడ్ సమాజ ప్రముఖులు సంతోష్ పాటిల్, బుడగ జంగాల నాయకులు మాదినం అంజన్న, స్థానిక విద్యావేత్తలు హరికుమార్, తులసిదాం రాథోడ్ దశరథ్ రెడ్డి, కృష్ణారెడ్డి విశ్వనాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు వీరారెడ్డి, మహిళా సమాజ్ ప్రముఖులు మంగళ కౌలాస్ పద్మజ, ఇతరులు బేజుగం రాజేష్, మోచి సంఘం నాయకులు, ముదిరాజ్ సంఘం పట్టణం అధ్యక్షులు దత్తాద్రి, ఆర్య సమాజ్ నాయకులు, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, మాల మహానాడు నాయకులు ఆకాశ్, అందోల్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నుంచి వచ్చిన సమాజ్ ప్రముఖులు వివిధ కుల సంఘాల నాయకులు, రాష్ట్రీయ బసవదల్ యువ నాయకులు వడ్డేశ్వర ఆనంద్, ప్రశాంత్ పాటిల్, అశోక్ పాటిల్, సుదీర్ బండారి, కార్మిక సంఘాల నాయకులు మహీపాల్, మాదినం శివ, ఢిల్లీ వసంత్ కార్యాలయ సిబ్బంది జాన్సన్, భూమన్ స్టీవెన్సన్, శ్రీనివాస్ ముదిగొండ తదితరులు పాల్గొన్నారు