తడిసి మోపెడు అవుతున్న ఎన్నికల ఖర్చు
రోజువారీ ఖర్చులతో అభ్యర్థుల గుండె గుభేల్
వాహనాలు మొదలు..భోజనాల వరకు భారీగా ఖర్చు
హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడు
అవుతున్నాయి. ప్రదానంగా ఎన్నికల ప్రచార వాహనాలు, బోలు వాయిదా/-యాలు, డప్పులు, ఊరేగింపులకు మనుషులు మొత్తంగా ఒక్కో అభ్యర్థికి రోజుకు లక్షల్లో చిలుము వదులుతోంది. దీంతో ఒక్కో సమయంలో ముందుగానే రిజర్వ్ చేసుకోవా/-లసి వస్తోంది. దాదాపు అన్ని పార్టీల పరిస్తితి ఇలాగే ఉంది. ఎన్నికల ప్రచారంలో ఈసారి వాహన వినియోగం బాగా పెరిగింది. ట్రావెల్స్‌లలో వాహనాలు దొరకడం లేదు. వాహనాల అమ్మకాలు కూడా రెండు శాతం పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక తీర్థయాత్రలు, వివాహాలు, ఇతర అవసరాలకు కార్లు, బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. వీటి కిరాయిలను కూడా వ్యాపారులు పెంచేశారు. ఒక్కో సమయంలో వాహనాలు దొరకక సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో నాయకుడు నాలుగైదు వాహనాలను అద్దెకు తీసుకుంటుండడంతో వాహనాలు కొదవతోపాటు రేట్లు కూడా పెరిగిపోయాయి. ఎన్నికల్లో ప్రతి చిన్న పనికీ వాహనాలను వినియోగించాల్సిందే. కార్యకర్తల కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేస్తున్నారు. గ్రామంలో ముఖ్య నాయకుడి నుంచి మొదలు కొని మండల నాయకుల వరకూ ఎన్నికలు ముగిసే వరకూ ప్రత్యేక ప్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు. వాహనాల వినియోగం పెరగడంతో పెట్రోలు, డీజిల్ వాడకం కూడా బాగా పెరిగింది. ప్రతి పెట్రోల్ బంకులో అభ్యర్థులు ముందుగానే రూ.లక్షలు డిపాజిట్ చేసి కూపన్లు ఇస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులను నియమించుకున్నారు. ప్రచారానికి వచ్చే వారికి కూపన్లతోపాటు నగదును కూడా ఇస్తున్నారు. జిల్లాలో సాధారణ రోజుల్లో రోజుకు పెట్రోలు లక్ష లీటర్లు, డీజిల్ ఐదు లక్షల లీటర్లు అమ్మకం జరుగుతుంటుంది. ఎన్నికల కారణంగా ప్రస్తుత నెల నుంచి వినియోగం బాగా పెరిగినట్లు పెట్రోలు బంకుల యజమానులు పేర్కొంటున్నారు. ఎన్నికలంటే నాయకులు, కార్యకర్తలకు పండుగే. ఈసారి ముందస్తు ఎన్నికలు డిసెంబరు 7న జరగనుండడంతో కార్యకర్తలను, ఓటర్లను ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. వారియి అభ్యర్థులు అంతా తామే అయి చూసుకుంటున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్. వీటన్నింటికీ ఆయా ¬టళ్లలో ఏకంగా కొందరు కూపన్లు కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ¬టళ్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. లాడ్జీలలో సైతం అభ్యర్థులు తమ బంధుగణాన్ని, అనుచర గణాన్ని దింపి ప్రచారానికి తీసుకువెళ్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో మద్యం ఖర్చుకు లెక్కే లేకుండా పోయింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు మందు సీసాలను కుమ్మరిస్తే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు రాత్రిపూట విందులు చేసుకుంటున్నారు. దీంతో మద్యం ఖర్చుకు లెక్క లేకుండాపోయింది. అధికారులు సైతం నిత్యం ఐదు నియోజకవర్గాల్లోని బార్‌లు, వైన్‌షాపుల్లో ఏ రోజు ఎంత మద్యం అమ్ముడు పోయిందనే సమాచారం సేకరిస్తున్నారు. అత్యధికంగా మద్యం కొనుగోలు చేస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. దీంతో కొంతమంది నాయకులు రహస్యంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెల్‌ఫోన్ వినియోగం రోజుకు రూ.కోటి చేతి చమురును వదిలించుకుంటోంది. ఎన్నికల పుణ్యమా అని అది మరింత పెరిగింది. ఓటర్లు, నాయకులు, కార్యకర్తలతో నిత్యం మాట్లాడుతూ వారి సమాచారం సేకరిస్తూ కిందిస్థాయి క్యాడర్‌ను పురమాయిస్తూ అభ్యర్థుల బంధువులందరూ అంతా సెల్‌ఫోన్లలో బిజీగా ఉండిపోయారు. అదేవిధంగా ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర ఇంటర్నెట్ లాంటి సోషల్‌విూడియా ద్వారా ప్రచారం కోసం తెగ ఖర్చు పెడుతున్నారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా సోషల్ విూడియాపై ఓ ప్రత్యేక దృష్టి సారిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేపడుతున్న ప్రచారం కూడా లెక్కలు వేసూ పనిలో పడ్డారు. మొత్తానికి అభ్యర్థులకు ఖర్చుఉల తడిసి మోపెడు అవుతున్నాయి. డబ్బులు లేకుంటే
పలకరించడనాఇకి కూడా ఎవరు ముందుకు రావడంలేదు.