తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికే పంపాలని మంత్రి తలసాని పిలుపు..
( సికింద్రాబాద్ / జనం సాక్షి )బుధవారం భోలక్ పూర్ లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నూతన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సర్కారు బడులకు పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మన బస్తీ – మన బడి పథకం లో భాగంగా
సనత్ నగర్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది పరుస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో అద్భుతమైన విద్యను అందిస్తున్న మేకలమండి పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తాను అన్ని విధాలుగా సహకారం అందిస్తానని అన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ మల్లికార్జున రెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ముగ్గురు విద్యార్థులు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కి ఎంపికయ్యారని ఆయన మంత్రికి వివరించారు.
ఉన్నత పాఠశాల సాధన కమిటీ కన్వీనర్ ఇ. చంద్రశేఖర్, కో కన్వీనర్ బీ. నర్సింగ్ రావు , విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.