తిగుల్ ను మండలం గా ప్రకటించాలని కోరుతూ కొనసాగుతున్న దీక్షలు

జగదేవ్ పూర్ , ఆగస్టు   జనంసాక్షి  : జగదేవ్ పూర్  మండలంలోని మేజర్ గ్రామమైన తిగుల్ ను మండల‌ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఆగష్టు ఒకటి నుండి తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. మంగళవారం నాటికి దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిదవ రోజు దీక్షలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు మల్లేశం, సభ్యులు కనకయ్య, బాల్ నర్సయ్య, బాలకృష్ణ కుర్చున్నారు. వీరికి తిగుల్ మండల సాధన సమితి సభ్యులు, సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్యలు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిగుల్ ను మండల కేంద్రంగా చేసేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. మండల వ్యవస్థ ఏర్పాటు నుంచి తిగుల్ మండలం కావాలని కోరుతున్నట్లు వివరించారు. మండల ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. మరోసారి మంత్రి హరీష్ రావును కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో సభ్యులు ఈశ్వర్, శివశంకర్, మహేందర్ రెడ్డి, వెంకటేష్, రాములు,   తదితరులు పాల్గొన్నారు.