తిత్లీ తుపాన్ బాధితులకు అండగా ఉంటాం
సహాయ కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలు
విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన పవన్
ఐటి రైడ్‌పై ఉలికి పాటు తగదని హితవు
విజయవాడ,అక్టోబర్13(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుపాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం విూడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన సైనికులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన నాదెండ్ల మనోహర్‌తో కలిసి సాయంత్రం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.
విజయవాడలో జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం శుభపరిణామమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనస్తత్వం ఉన్న పవన్‌తో కలిసి పనిచేయాలనే తాను జనసేనలోకి చేరినట్లు వివరించారు. ఈ క్రమంలో దీర్ఘకాల పోరాటాలకు సైతం సిద్దంగా ఉన్నమని తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి త్యాగాలకైనా తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈనెల 15న జరగనున్న జనసేన కవాతులో ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనోహర్‌తో తనకు పాఠశాల స్థాయి నుంచే పరిచయం ఉందని
పవన్ తెలిపారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన విలువైన సలహాలు, సూచనలు అందిచేవారని తెలిపారు. సరికొత్త రాజకీయ శకం ఏపీకి కావాల్సిన తరుణంలోనే జనసేన ఆవిర్భవించిందని కేవలం 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం కాదని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. ఐటీ దాడులు సచివాలయం, సీఎం ఇంటిపై జరిగుంటే ప్రభుత్వానికి అండగా ఉండేవాళ్ల మన్నారు. కానీ వ్యాపారవేత్తలపై రైడ్స్ జరుగుతుంటే టీడీపీకి ఎందుకని నిలదీశారు. నిజంగా ఢిల్లీలో మాదిరిగా కేజీవ్రాల్‌పై జరిగినట్లుగా.. అమరావతిలో కూడా ఐటీ దాడులు జరిగుంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్లమని వెల్లడించారు. అయినా తానెప్పుడూ బీజేపీని వెనకేసుకురాలేదన్నారు. వెనకేసుకురావడానికి బీజేపీ మాకు బంధువేవిూ కాదన్నారు. మోదీ ‘నాకు బ్రదరు కాదు.. అమిత్ షా నా బాబాయి’ కాదని చెప్పారు.