తిరుమలలో వైభవంగా బ్ర¬్మత్సవాలు
హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
తిరుమల,అక్టోబర్15(జనంసాక్షి): తిరుమలలో నవరాత్రి బ్ర¬్మత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనంపై ఊరేగుతున్న స్వామి వారిని చూసి భక్తులు పులకించిపోయారు. భక్తుల రాకతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైతింది. నవరాత్రి బ్ర¬్మత్సవాల్లో కోనేటి రాయుడిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తిరుమల తరలివచ్చారు. దీనిలో భాగంగా ఆరో రోజు ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష తిరువాణాభరణాలతో అలంకృతులైన స్వామి వారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వాహనసేవ ముందు కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఆంజనేయునిపై ఆసీనులై విహరిస్తున్న స్వామివారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇకపోతే ఆదివారం రాత్రి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతునిపై ఆశీనులైన దేవదేవుడిని దర్శించుకునేందుకు భక్తకోటి పోటెత్తింది. సప్తగిరులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి. శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడోత్సవం ఆద్యంతం కమనీయంగా సాగింది. అర్ధరాత్రి వరకు తిరువీధుల్లో నిండిన జనసంద్రం మధ్య శ్రీనివాసుడు అభయహస్తం ప్రసాదించారు. సాయంత్రం 7 గంటలకు వాహన మండపం తెర తీసి గరుడ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారి దర్శనాన్ని భక్తకోటికి కల్పించారు. గతం కంటే మిన్నగా గరుడోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరువీధుల వెంట అటు ఇటు ఉన్న భక్తులకు వాహనాన్ని మళ్లించి నెమ్మదిగా కనువిందుగా శ్రీవారిని చూపించారు. మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ సహస్రనామమాల వంటి విశేష తిరువాభరణాలతో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా వెలుగొందారు.
దీంతో తిరుమల రహదారులన్నీ భక్తజన ప్రవాహమైంది. తిరుమలకు శనివారం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం ఉదయం 8 గంటలకే తిరువీధుల వెంటఉన్న గ్యాలరీల్లోకి జనం క్యూ కట్టారు. మధ్యాహ్నం 12 గంటలకే భక్తులతో తిరుమల కిటకిటలాడింది. గతంలో కంటే తోపులాటలను నియంత్రించ గలిగారు. వీఐపీ పాసులను పరిమితం చేశారు. తిరువీధుల వెంట గ్యాలరీల్లోకి ప్రవేశ, నిష్కమ్రణ చర్యలు పగడ్బందీగా చేపట్టారు. గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో తిరుమల వీధుల్లో ఏర్పాటు చేసిన భారీ పరిమాణం గల ఎల్‌ఈడీ తెరలకు వందలాదిగా భక్తులు పరిమితమయ్యారు. రవాణా సౌకర్యం మెరుగ్గా కనిపించాయి. ఆర్టీసీ బస్సులను ఎక్కువ సంఖ్యలో నడిపి యాత్రికుల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. వార్షిక బ్ర¬్మత్సవాల అనుభవాలతో తితిదే ప్రత్యేక దృష్టి పెట్టడంతో భక్తులకు సమస్యలు చాలా వరకు తప్పాయి. శ్రీవారిని కనువిందుగా దర్శించుకున్నామనే సంతోషం భక్తకోటిలో వెల్లివిరిసింది. తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, ఇంఛార్జ్ సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి సమష్టి కృషితో తీసుకున్న చర్యలు ఫలితాలనిచ్చాయి.