తీజ్ ఉత్సవాల్లో కొట్లాట

నంగునూరు,ఆగస్టు26(జనంసాక్షి):
 గురువారం రోజున నంగునూరు మండలం జెపి తండా గ్రామంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో భాగంగా రాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడమే కాకుండా కర్రలతో, రాళ్లతో విపరీతంగా కొట్టుకున్నారు. రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 తేదీ 25. 8. 2022 నాడు నంగునూరు మండలం జెపి తాండ గ్రామంలో రాత్రి 9 గంటల సమయంలో గ్రామంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో  బుక్య శంకర్, బుఖ్య సునీల్,  ధరావత్ ప్రవీణ్,  మాలోతు శైలజా,  బుక్య బుజ్జి  అనే కొందరు యువకులు  నృత్యాలు చేస్తుండగా.. వీరిని అదే గ్రామానికి చెందిన  గుగులోతు ప్రవీణ్, గుగులోతు కళ్యాణ్,  గూగుల్ లో పవన్, గూగుల్  చందర్,  గుగులోతు శివ, బుక్య శంకర్,  బుక్య గణేష్ లు  కలసి రాళ్లతో, కర్రలతో,  పైపులతో దాడి చేసి కొట్టినారని  బుఖ్య శంకర్ తండ్రి సక్రు చేసిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపినారు.