తునిలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న రఘువీరా
కాకినాడ,అక్టోబర్23(జనంసాక్షి): డాక్టర్ పాండు రంగారావు ఆధ్వర్యంలో మంగళవారం తునిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో వివిధ వ్యాపారులు, సామాజిక వర్గాల ప్రజలను కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక ¬దా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కాపులు బీసీలో చేర్చాలని కోరుతూ చేస్తున్న డిమాండ్‌ను నెరవేస్తామని పేర్కొన్నారు.