తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అచ్చెన్న పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా
శ్రీకాకుళం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఎంపి కింజరపు రామ్మోహన్‌ నాయుడు సరుబుజ్జిలి మండలంలోని ములసవలపురం గ్రామంలో తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను సోమవారం సందర్శించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. నష్టాన్ని, తుపాను ప్రభావాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కనీవిని ఎరుగని రీతిలో జరిగిన నష్టాన్ని పూడ్చలేనిదని బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకునేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సిఎం చంద్రబాబు స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అలాగే  నిత్యవసరాలను పంపిణీ చేశామని అన్నారు. బాధితులు తమ సమస్యలను వివరించగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఉదారంగా సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా చివరి వరకు అండగా ఉంటుందని ఎంపి పేర్కొన్నారు.  ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనివిధంగా సాయం చేసేందుకు చర్యలు చేపట్టామని, విపత్తు తీవ్రత అధికంగా ఉన్నందున చిన్న ఇబ్బందులు ఏర్పడి ఉండొచ్చని అందరి సహకారంతో పునరుద్ధరణ చర్యలకు ముందుకెళ్తామన్నారు.  సహాయకచర్యలు ఊపందుకున్నాయని వివరించారు.

తాజావార్తలు