తెదేపా గెలుపు ఏకపక్షం కానుంది

– బీసీ సభతో తెదేపావైపే బీసీలున్నారని మరోసారి స్పష్టమైంది
– బీసీ కులాల ఐక్యతను కాపాడుకోవాలి
– బీసీలపై వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలి
– కోల్‌కతా సభకు ధీటుగా అమరావతిలో ధర్మపోరాట దీక్ష
– దగ్గుబాటి కుటుంబం మారని పార్టీలు లేవు
– వీళ్ల ఫిరాయింపులన్నీ అధికారం కోసమే
– లక్ష్మీపార్వతి కూడా అందుకే ఆ పార్టీతో కుమ్మక్కయ్యారు
– ఎన్టీఆర్‌ను వాడుకొని.. ఆయనకు అప్రతిష్ట తెచ్చారు
– వాళ్ల డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
–  టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జనవరి28(జ‌నంసాక్షి) : రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఏకపక్షం కానుందని, ఆదివారం జరిగిన జయ¬ బీసీ సభతో ఈ విషయం మరోసారి స్పష్టమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బీసీల ఐక్యత దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, బీసీలను చీల్చి కుట్రలు చేసేందుకు వైసీపీ, టీఆర్‌ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని, బీసీలపై వైసీసీ, టీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. సోమవారం ఆయన ఎలక్షన్‌ మిషన్‌-2019పై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ 29కులాలను బీసి జాబితా నుంచి తొలగించిందన్నారు. టీఆర్‌ఎస్‌తో జగన్‌ కలయిక బీసీ వ్యతిరేకమని చంద్రబాబు విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలే వైసీపీ అజెండా అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రాజమండ్రిలో విజయవంతంగా నిర్వహించిన జయ¬ బీసి సభ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. బీసీ హావిూలన్నింటినీ ఫ్లెక్సీలతో ప్రచారం చేయాలన్నారు. రాజమండ్రి సభ ‘మూడ్‌ ఆఫ్‌ ది స్టేట్‌’కు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈవారం రోజులు దీనిపై ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు. రాజమండ్రి సభ ‘మూడ్‌ ఆఫ్‌ ది స్టేట్‌’కు నిదర్శనమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఏకపక్షం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జయ¬ బీసి సభ ప్రజలకు తెలుగుదేశంపై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టిందని.. ఈ నమ్మకాన్ని ఇలానే కొనసాగించాలని చంద్రబాబు సూచించారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని.. బీసీ కులాల ఐక్యతను కాపాడుకోవాలని నేతలకు సీఎం సూచించారు. బీసీలపై వైకాపా, తెరాస కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం 29 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని ఆయన గుర్తు చేశారు. తెరాసతో వైకాపా అధ్యక్షుడు జగన్‌ కలయిక బీసీ వ్యతిరేకమని.. ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్‌ అజెండా అని విమర్శించారు. నిన్న మధురైలో ప్రధాని మోదీకి ఎదురైన నిరసనలు ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’కు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. గజ తుపానుపై మోదీ నిర్లక్ష్యానికి మధురైలో నిరసనలు ఎదురయ్యాయని.. తమిళనాడుతో పోలిస్తే ఆంధప్రదేశ్‌కు భాజపా తీరని ద్రోహం చేసిందని చెప్పారు. మోదీ, అమిత్‌షా రాష్ట్రానికి వస్తే తీవ్రవ్యతిరేకత, నిరసనలు ప్రజల నుంచి వ్యక్తమవుతాయన్నారు. అమరావతిలో జరిగే చివరి ధర్మపోరాట సభకు జాతీయ పార్టీల నేతలంతా వస్తారని.. కోల్‌కతాలో జరిగిన విపక్షాల ర్యాలీకి ధీటుగా అమరావతి సభ ఉండాలని నేతలకు సీఎం స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు కలిసికట్టుగా పనిచేసి అమరావతి ధర్మపోరాట సభను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
దగ్గుబాటి కుటుంబం మారని పార్టీలు లేవు..
అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైకాపాలో చేరుతోందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్న ఆయన.. ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు అన్నిపార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో పురందేశ్వరి కేంద్రమంత్రి అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ తర్వాత కాంగ్రెస్‌ను వదిలేసి భాజపాలో చేరారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ వైకాపాలో చేరుతున్నారన్నారు. వీళ్ల ఫిరాయింపులన్నీ అధికారం కోసమేనని చంద్రబాబు
మండిపడ్డారు. లక్ష్మీపార్వతి కూడా అందుకే ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు దుయ్యబట్టారు. అవకాశవాదంతోనే ఆనాడు తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని.. దాంతోనే ఆయనకు అప్రతిష్ఠ తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాంటి వాళ్లందరూ ఇప్పుడు ఒక చోటికే చేరారన్నారు. వాళ్ల డొల్లతనాన్ని ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.