తెరాస ప్లీనరీలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్‌


-హైదరాబాద్‌ నుంచే భూకంపం పుట్టిస్తా
– గులాబీ పరిమళాలు దేశమంతా వెదజల్లుతా
– కాంగ్రెస్‌, బీజేపీ కబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేద్దాం
– ఇరు పార్టీల నేతల చేతగానితనంతోనే దేశంలో నీటియుద్ధాలు జరుగుతున్నాయి
– జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషిస్తుంది
– నేనొక్క ప్రకటన చేస్తే దేశం దద్దరిల్లిపోతుంది
– రెండు మూడు నెలల్లోనే దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెస్తాం
– ఫెడరల్‌ ప్రంట్‌కు టెంటే లేదంటున్నారు..
– మరి.. విూకెందుకంత భయం
– ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకొస్తే దేశంలో 40 కోట్ల ఎకరాలకు నీళ్లిస్తం
– గ్రామ సడక్‌ యోజన విూకు అవసరమా?
– రోడ్లు వేయటానికి గ్రామాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు లేరా?
– ఇదేనా దేశాన్ని పాలించే తీరు
– జై భారత్‌.. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్‌ 
హైదరాబాద్‌, ఏప్రిల్‌27(ఆర్‌ఎన్‌ఎ) : దేశ రాజకీయాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌తో క్రియాశీలక పాత్ర పోషిస్తామని,
హైదరాబాద్‌ నుంచే భూకంపం పుట్టిస్తామని, దేశం మొత్తం గులాబి పరిమళాలు వెదజల్లుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లి వద్ద టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీలో సీఎం మాట్లాడుతూ కేంద్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల దీవెనలు.. ఆశీస్సులతో ముందుకు పోతామని, ఈ గులాబీ పరిమళాలను దేశంలోని మారుమూల గ్రామాల్లోకి తీసుకుపోతాయన్నారు. ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, కావాల్సినన్ని వనరులు ఉన్నాయని, డబ్బులు ఉన్నాయని, అద్భుతమైన నదులు, భూములు ఉన్నాయని.. కానీ నాయకుల్లో అవగాహన శక్తి లేకనే ఈ దుర్భర పరిస్థితి నెలకొని ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం పెరగాలన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాలని బాధ్యత గల రాష్ట్రంగా దేశం బాగు కోసం ఉద్యమిస్తామన్నారు. దేశ ప్రజలను కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టాల్రను మున్సిపాలిటీల కంటే హీనంగా చూస్తున్నారని, వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రావిూణాభివృద్ధి, పట్టాణాభివృద్ది, తాగునీటి వసతి, ఆరోగ్యం కేంద్రం వద్ద ఎందుకు? అని నిలదీశారు. ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన.. విూకు అవసరమా? రోడ్లు వేసేందుకు సర్పంచ్‌, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ లేదా? అని ప్రశ్నించారు. నరేగా కూలీలకు పోస్టాఫీసులో వేసే దుస్థితి నెలకొని ఉందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
టెంటే లేనప్పుడు విూకెందుకు భయం..?
దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ఇటీవలే ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి తాను చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. ప్రధాని మోదీ ఏజెంట్‌ కేసీఆర్‌ అని రాహుల్‌ గాంధీ అంటున్నారు. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు.
టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అంటే అందరికీ భయం.. కేసీఆర్‌ మొండి కదా.. అది భయం. కేసీఆర్‌ ఏదైనా అనుకుంటే చేసి చూపిస్తాడని అందరిలో ఉందన్నారు. అందుకే వారికి భయం పట్టుకుందన్నారు. దేశం బాగు కోసం ఎంతకైనా పోరాడుతామని, తెలంగాణను ఎట్ల అయితే తెచ్చి చూపిన్నో.. దేశం మంచి కోసం కూడా ఆ విధంగా పనిచేస్తానన్నారు. ఎవ్వరికీ భయపడనని, విూ అందరి సహకారంతో ముందుకు పోతానన్నారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ క్రియాశీలక పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల అసమర్థత పాలన వల్ల దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, ఆయా రాష్టాల్ల్రో ఈ పార్టీల కారణాంగానే నీటి కష్టాలు వచ్చాయన్నారు. దేశానికి ఎంతో కొంత తెలంగాణ నుంచి మేలు జరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.
దేశంలో 40కోట్ల ఎకరాలకు నీళ్లిస్తం..
ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే దేశంలో 40 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్‌ తెలిపారు. మరో ఆరేడు ఏళ్లలో ఆ నీటిని ప్రతి ఎకరాకు అందే విధంగా ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల వల్లే దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయని, రైతాంగం సమస్యలను పరిష్కరించేందుకు బృహర్త ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి ఎకరాకు, ప్రతి పంటకు, ప్రతి రైతుకు నీరు అందించే విధంగా విధానాలను తయారు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ప్రకృతిపరకంగా దేశానికి ఆ నీరు లభిస్తోందన్నారు. కానీ అందులో 40వేల
టీఎంసీలను దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల సాగు భూమికి సరఫరా చేయవచ్చు అని కేసీఆర్‌ అన్నారు. ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం నీళ్లను పంచితే అన్ని రాష్టాల్రకు 40వేల టీఎంసీలు సరిపోతాయన్నారు. కానీ గత పాలకులు ఆపని చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా 25వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు సీఎం చెప్పారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇంకా నీటి వివాదాన్ని తేల్చ లేకపోయిందన్నారు. రాష్టాల్ర మధ్య, ప్రాంతాల మధ్య యుద్ధాలు పెట్టి, కాంగ్రెస్‌-బీజేపీ ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయన్నారు. దేశంలో ఆశారం, డేరా బాబాలు, నీరవ్‌, లలిత్‌ మోడీలు.. ఇదీ దేశం చేసుకున్న కర్మ అన్నారు. దేశ తలసరి ఆదాయం పెరిగాలని, రైతుల ఆత్మహత్యలు తగ్గాలన్నారు. బాధ్యత గల రాష్ట్రంగా దేశ బాగోగులు కోసం ఉద్యమిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రంలో పార్టీలు మారితే స్కీంలు మారతాయి తప్ప.. ప్రజలకు ఒరిగేదేవిూ లేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జై తెలంగాణ.. జై భారత్‌ అంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.