తెరాస మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల వ్యవసాయ రుణం వడ్డీతో సహా మాఫీ చేయాలి…
రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు 2018 ఎన్నికల్లో తెరాస మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల వ్యవసాయ రుణం వడ్డీతో సహా మాఫీ చేయాలనీ, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్(పంటల) భీమా యోజన అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కిసానమోర్చా అధ్యక్షులు జీనుకల కృష్ణాకర్ రావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం రైతులను విస్మరించిందని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, బ్యాంకులు రుణ మాఫీ చేయలేదని అన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైన బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పతకం రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా అమలు చేస్తే ఇప్పుడు వచ్చిన వరదల వల్ల రైతులకు ఎంతో కొంత ఉపశమనం లభించేదని అన్నారు. వరదల వల్ల రైతులు వేసిన నార్లు పత్తి మొత్తం మునిగి చాలా నష్టం వాటిల్లిందనిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ములుగు మండల బీజేపీ ఉపాధ్యక్షులు గొంగల్ల కట్టయ్య,జిల్లా సీనియర్ నాయకులు అన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి,బాణాల రాజ్ కుమార్,బొమ్మగానీ సారయ్య,గూడెల్లి కొంగేల్లి,రామ్ బాబు,కె. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




