తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన అపర భగీరధుడు సీఎం కెసిఆర్

– ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హుజూర్ నగర్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి): తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన అపర భగీరధుడు సీఎం కెసిఆర్ అని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథరెడ్డి లు అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను, స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సారధ్యంలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10 వ వార్డులోని స్థానిక కనకదుర్గ అమ్మవారి దేవాలయము నందు ఘనంగా పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. వృద్ధులకు బెడ్ షీట్లు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మరాంరెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ కె ఎల్ ఎన్ రెడ్డి , అట్లూరి హరిబాబు, గోల్డ్ పిచ్చయ్య, కౌన్సిలర్లు కొమ్ము శ్రీను, జక్కుల శంబయ్య, ములకలపల్లి రాం గోపి, చిలక బత్తిని సౌజన్యధనుంజయ్, గుండా ఫణి కుమారిరామ్ రెడ్డి, దొంగరి మంగమ్మవీరారెడ్డి, మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, వార్డు ఇంచార్జ్ మధు, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, వార్డు అధ్యక్షులు తండు సాయిరాం గౌడ్, శీలం సైదులు, శీలం వీరయ్య, ఉపతల బుచ్చయ్య, పులిచింతల వెంకటరెడ్డి, మేడి గురవయ్య, చంద్రగిరి రాము, పట్టణ బిఆర్ఎస్ నాయకులు గింరెడ్డి వెంకట్ రెడ్డి, పండ్ల హుస్సేన్ గౌడ్, పాల్వాయి గమానియల్, బండి భాస్కర్, యువజన నాయకులు జడ అంజి యాదవ్, కోళ్లపూడి చంటి, నరసింహారావు, లిఖిత్, జనిగ సందీప్, వినయ్ యాదవ్, దగ్గుపాటి రాజేష్, మేరీగ సాయి , గొర్రె వీరబాబు, సోమపొంగు రవీంద్ర, కస్తాల రామకృష్ణ, అఖిల్, కస్తాల కృష్ణ, షేక్ బాల సైదా, మహిళా నాయకురాలు వెంకట నర్సమ్మ, మలిదశ ఉద్యమకారురాలు చెవుల కవిత తదితరులు పాల్గొన్నారు.