‘తెలంగాణమార్చ్‌’కు ముంబై నుండి బహుజనుల మద్దతు

ముంబాయి: రాజకీయా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న విద్యార్థుల కవాతుకు,సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ముంబాయి తెలంగాణ బహుజన ఫోరం తెలిపింది.  ఈ రోజు ఉదయం ములుండ్‌ పశ్చిమంలోని ”తెలుగునాకా” వద్ద ఎంటీబీఎఫ్‌ ఆధ్వర్యంలో టీ మార్చ్‌కు మద్దతుగా ప్రదర్శన జరిగిందని ముంబాయి తెలంగాణ బహుజన ఫోరం తెలిపింది. ఇంటికో మనిషి చేతిలో నీలి జెండా చేతబూని బుద్దుని మార్గంలో మార్చ్‌ను విజయవంతం చేయాలన్నారు. ఈ సంధర్భంగా ముంబై తెలంగాణ బహుజన ఫోరం కన్వీనర్‌ బి.ద్రవిడ్‌ మాదిగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ దీర్ఘ కాలంగా కాలయాపన చేయటం మూలంగా తెలంగాణోద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ లాంటి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కో-కన్వీనర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటును నిరాకరించే వారు వాయిదా వేస్తారు. ఉద్యమానికి మాత్రం వాయిదా ఉండదని, ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందన్నారు. మార్చ్‌కు సిద్దమవుతున్నారని కొదండరాంపై కరీంనగర్‌లో పోలీసులు కేసు నమోదు చేయటం, విమలక్క అరెస్ట్‌ ఇవ్వన్ని ఉద్యమాన్ని అనిచివేయటానికే అని పేర్కొన్నారు. తక్షణమే కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్‌రెడ్డి, పోన్నాల అశోక్‌, సీహెచ్‌ మల్లేశ్‌ మాల, భీంరావు మాదిగా, సతీష్‌ బోగగిరి, చిట్యాల రాము, తైదాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.