తెలంగాణలో బిజెపి జెండా ఎగరడం ఖాయం- బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్.
*తెలంగాణలో బిజెపి జెండా ఎగరడం ఖాయం- బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వరంగల్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరవుతుండడంతో
శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ నుండి వంద ప్రత్యేక వాహనాల్లో బిజెపి బహిరంగ సభకు బయలుదేరిన వాహనాలకు నర్కడలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు బహిరంగ సభ తో ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరిగిందన్నారు. ఈ ఆదరణ చూసి పాదయాత్రకు అనుమతించకపోయినా, భారీ బహిరంగ సభకు అనుమతించక పోయిన కోర్టు ద్వారా అనుమతి తీసుకొని సభ నిర్ణయించుకోవలసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ దే గెలుపు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్,సర్పంచ్ సునిగంటి సిద్దులు, బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్క ప్రవీణ్,నాయకులు మహెష్,మోహన్ రావు, అశోక్, నగేష్ గౌడ్,మొండే కుమార్,రాజు నాయక్, భాస్కర్, కిట్టు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : వరంగల్ సభకు బయలుదేరుతున్న కాన్వాయ్ కి జెండా ఊపి ప్రారంభిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్.