తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం తెలిపిన టిజేఎస్ నేత తాండూరు మునిసిపాలిటీ కౌన్సిల్లర్ సాంబూరు సోమశేఖర్.

తాండూరు జూన్ 6(జనంసాక్షి)ఇందిరా చౌక్ లో ప్రో. కోదండరాం సార్ చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో సోమశేఖర్  పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నిరంకుశ పాలన, కుటుంబ పాలన కొనసాగుతుందని, ఉద్యమ ఆకాంక్షలను మరిచి ఉద్యమద్రోహులకు పదవులు కట్టబెడుతుందన్నారు.విద్యా వైద్యాన్ని గాలికొదిలేసి మద్యానికి ప్రజలను బానిసలు చేస్తుంది.గ్రామ పంచాయితిలల్లో సర్పంచులు బిల్లులు విడుదల కాకా ఏమిపాలుపోలేని అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు,317 జి.వో ద్వారా ఎంతో ప్రభుత్వ ఉద్యోగులు వేదనకు గురవుతున్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్నీ వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారు అని, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో, మెడికల్ కాలేజీలు, కొత్త ప్రోజెక్టుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అధికారమే అహంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు పదవులు కట్టబెడుతూ అమరుల ఆకాంక్షలకు విస్మరిస్తూ ప్రజా అగ్రహనికి గురవుతుందన్నారు. కచ్చితంగా ప్రజా తిరుగుబాటు మొదలుతుంది అని తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు.