తెలంగాణ ఇచ్చేయండి !
నాకేం అభ్యంతరం లేదు : కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక తెలంగాణ ఇవ్వ డం వల్ల తనకేం అభ్యంతరం లేదని కేంద్ర గిరిజన శాఖా మంత్రి కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమా వేశమ య్యారు.ఈ సందర్భంగా తెలంగాణతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ దుస్థితిని ఆయన వివరించినట్లు సమాచారం. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడు తూ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇద్దరు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్నారు. సంస్థా గతంగా పార్టీ అత్యంత దయనీయమైన పరిస్థితి ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం రాష్ట్ర్రంలో కింది స్థాయిలో పార్టీ యూనిట్ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ అంశంలో పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణ ఇచ్చినా తనకెంత మాత్రం అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.