తెలంగాణ ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటా..!

తెలంగాణ ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటా..!

సంగెం: సెప్టెంబర్ 29 (జనం సాక్షి)
వరంగల్ ఉమ్మడి జిల్లాలొ బీజేపీ పార్టీ మొట్టమొదటిగా గెలిచే స్థానము పరకాల నియోజకవర్గమేనని,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు.శుక్రవారం రోజున సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పరకాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఓటుకు 10000 ఇచ్చిన గెలవని పరిస్థితి ఉందని,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పతనం ప్రారంభమైందని,దానికి ఉదాహరణ పరకాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు కంచుకోట అయిన వరికోల్ గ్రామంలో గ్రామస్తులందరూ ముక్తకంఠంతో చల్లా గో బ్యాక్ అని,నీకు ఓటు వేయమని కరాకండిగా ముఖం ముందే చెప్పడం చల్ల ధర్మ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో కనపడుతుందని అన్నారు.సంగెం మండలంలో కూడా బిజెపి ప్రభుత్వానికి 100% ఓట్లు పడతాయని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచేది బిజెపి పార్టీని అని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల సంక్షేమమే తప్ప కమిషన్లు కాంట్రాక్టులు లేవని ప్రజలే తాను అనే విధంగా ఉన్నాడని,యువత ప్రజలు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీని బలపరుస్తారని అన్నారు.ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు.అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని బిజెపి నాయకులు డాక్టర్ కాళి ప్రసాద్ రావు అన్నారు. కుంటపల్లి గ్రామంలో బిజెపి చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.తదనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో స్వతంత్ర లేకుండా పోతుందని,ప్రతి ఒక్కరం ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూనే ఉన్నామని అన్నారు.తెలంగాణ వస్తే నీళ్లు,నిధులు,నియామకాలు,ఆత్మ గౌరవం అని అనుకుంటే నీళ్లు కల్వకుంట్ల కుటుంబానికి,నిధులు కల్వకుంట్ల కుటుంబానికి వెళ్తున్నాయని నియామకాలు వస్తాయి అనుకుంటే ప్రతిసారి పరీక్ష నిర్వహించడం రద్దు చేయడంతో తెలంగాణలో నిరుద్యోగ పెరిగిపోయిందని అన్నారు.నిరుద్యోగ సమస్యతో జీవితం పై విరక్తి చెందిన యువకులు చాలామంది కనపడుతున్నారని అన్నారు.తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చదివిస్తే నేడు ఉద్యోగ అవకాశాలు లేక యువత భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని అన్నారు.ఆత్మగౌరమనే మాటే లేకుండా పోయిందని అన్నారు.పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పై దిక్కర స్వరం ఏర్పడిందని ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేను ఓడించాలని రాబోయే ఎన్నికల్లో బిజెపిని జెండా గద్దెక్కిస్తామని అంటున్నారని,ప్రతి ఒక్కరి స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉందని,రాబోయే ఎన్నికలలో కచ్చితంగా బిజెపి ప్రభుత్వం గెలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామీ యాదవ్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ రహ్మతుల్లా,గొర్ల కాపారుల సెల్ జిల్లా అధ్యక్షులు జక్క చేరాలు యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి వీరయ్య,సోషల్ మీడియా కన్వీనర్ రంగరాజు క్రిష్ణ,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దామెరుప్పుల చంద్రమౌళి(సి.ఎం),బీజేవైఎం మండల అధ్యక్షులు అవనిగంటి సతీష్,నాయకులు పోలబోయిన పైడి,సతీష్,రెడ్డబోయిన సారమ్మ,గొనె మూకుందం,తదితరులు పాల్గొన్నారు