తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభ
గీతన్న బందు కుటుంబానికి10 లక్షలు వెంటనే ప్రకటించాలి
కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి /శుక్రవారం రోజున తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ద్వితీయ మహాసభను మండల కేంద్రంలోని హరిహర గార్డెన్ లో నిర్వహించారు.ఈ మహాసభను పురస్కరించుకొని కల్లు గీత కార్మిక సంఘం కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి హరిహర గార్డెన్ వరకు సంఘం ప్రతినిధులు,గౌడ నాయకులు,గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా కేజీ కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వి రమణ,సభాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న పాల్గొనగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతన్న బంధు ప్రకటించి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని,గీత కార్మికులందరికీ ఉచితంగా బైకులు ఇవ్వాలని,వృత్తి చేసే వారందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా పెన్షన్ 5000 రూపాయలు ప్రకటించాలని,ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలి,కల్లుగీత కార్పోరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలని దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు,గాయాలైన వారికి వైద్య ఖర్చుల నిమిత్తము 25000 ఇవ్వాలని,ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఉన్న 560 జీవోని అమలు చేయాలి లేదా కొనివ్వాలని,గౌడ కులస్తులు ఐకమత్యంగా ఉంటూ అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని పిలుపునిస్తూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్,కేసముద్రం మండల అధ్యక్షులు బబ్బూరి ఉప్పలయ్య,కార్యదర్శి మోడెం వెంకటేశ్వర్లు,మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, పిఎసిఎస్ కేసముద్రం ఛైర్మెన్ దీకొండ వెంకన్న,కవి గాయకులు మానుకోట ప్రసాద్, మాజీ పిఎసిఎస్ దన్నసరి ఛైర్మెన్ బండారు వెంకన్న, గోపా మండల అధ్యక్షులు కూటికంటి మధు ,మహిళ ప్రతినిధి ఉపేంద్ర,ధీకొండ మధు,గంధసిరి సోమన్న,పొనుగంటి వీరస్వామి,గునిగంటి మోహన్,మేకపోతుల అంజయ్య ,గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area