.తెలంగాణ జీవనాడి బతుకమ్మ…
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అద్యక్షుడు అంబటి నాగయ్య..
మిర్యాలగూడ, జనం సాక్షి ప్రకృతి పరవశం, చిరుజల్లుల వికాసం,పూబోణుల సంబురం బతుకమ్మ.ప్రపంచంలో పూజకు పనికిరాని పూలను పండుగగా గుర్తించే ఏకైక ప్రాంతం తెలంగాణ.ప్రక్తృతి అంటే స్త్రీ.సమస్త స్రృష్టి కి మూలం స్త్రీ.పిల్ల బొడ్డెమ్మ లతో ప్రారంభమై తల్లి బతుకమ్మ గా నిలుస్తుంది.కుల,మతాలు లేకుండా నియమ నిబంధనలు లేకుండా నాలుగు చేతులు, జోడిస్తే బతుకమ్మ అని అన్నారు.బతుకమ్మ లో పేర్చిన తంగెడు , గునుగు కట్ల,బీర, గుమ్మడి పూలు సామూహిక ప్రతిరూపం.తంగెడు పసిడి కాంతులు వెదజల్లుతుందని పసుపు వర్ణం బంగారానికి ప్రతిరూపం.తెలంగాణ లోని ప్రతి పుట్ట, చెట్టు, చరిత్ర కు సజీవ సాక్ష్యాలు.అవి రాళ్ళు కాదు చరిత్ర కు ఆనవాళ్లు.వలస పాలన కాలంలో బతుకమ్మ ను నిషేధించారు.ఆట పాట మాట అంటే వారికి జంకు అని అన్నారు.బతుకమ్మ అందరిని ఒక్క తాటి పై నిలిపి తండ్లాట చేసి ఆరు శతాబ్దాల తెలంగాణ ప్రజల ఆకలిని , అవమానాలను కన్నీటి రెప్పల చాటున దాగిన కన్నీళ్ళను పోరాట రూపం చేసి సాకారం చేసింది.విజేత డిగ్రీ కళాశాల విద్యార్థులు తాంబూలం లో పువ్వులు ఒదిగినట్లు ప్రతి ఒక్కరూ అసమానతలు లేకుండా మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలని అన్నారు…తెలంగాణ జీవన ప్రతిబింబం బతుకమ్మ.మిర్యాలగూడ పట్టణం లో విజేత డిగ్రీ కళాశాలలో బతుకమ్మ మరియు గాంధీజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ గారు మాట్లాడుతూ ఉప్పును ఉప్పెనలా, నూలును విల్లు గా స్వేచ్ఛ ను శ్వాస గా మలిచిన మానవతా మూర్తి గాంధీజీ అని అన్నారు.అలాగే తెలంగాణ జీవన ప్రతిబింబం బతుకమ్మ తంగేడు పూవు చుట్టూ గునుగు పూవు అల్లుకున్నట్టు తెలంగాణ సాంస్కృతిక వారసత్వమంతా బతుకమ్మ పండుగ చుట్టూ అల్లుకొని ఉంటుంది. ఉన్న బతుకమ్మంటే చెరువు అలల మీద మెలమెల్లగా కదిలి పోయే పూల తేరు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలోని ప్రతి ఊరు వసంత శోభను సంతరించుకుంటుంది. తోవ పక్కన పూసిన పూలన్నీ, అడవిలో విరిసిన పుష్పాలన్నీ ఇంటికి చేరి ‘తాంబాలం’లో గుమ్మడి ఆకుల మీద బుద్ధిగా ఒదిగి కూర్చుంటాయి. తీరొక్క పూవులతో ముస్తాబైన బతుకమ్మను దేవుని గుడి ముందరో, చెరువు కట్ట మీదనో ఉంచి కన్యలందరూ వాళ్ళ తల్లులతో కలిసి కొత్త కోకలు కట్టుకొని ఆ గౌరీ మాతను తమకు పచ్చని జీవితాన్ని ప్రసాదించుమని బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నాజూకైన చేతులతో చప్పట్లు కొడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే అందరికీ బతుకమ్మ పండుగ అని అన్నారు.తెలంగాణ జీవన ప్రతిబింబం బతుకమ్మ.మిర్యాలగూడ పట్టణం లో విజేత డిగ్రీ కళాశాలలో బతుకమ్మ మరియు గాంధీజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ గారు మాట్లాడుతూ ఉప్పును ఉప్పెనలా, నూలును విల్లు గా స్వేచ్ఛ ను శ్వాస గా మలిచిన మానవతా మూర్తి గాంధీజీ అని అన్నారు.అలాగే తెలంగాణ జీవన ప్రతిబింబం బతుకమ్మ తంగేడు పూవు చుట్టూ గునుగు పూవు అల్లుకున్నట్టు తెలంగాణ సాంస్కృతిక వారసత్వమంతా బతుకమ్మ పండుగ చుట్టూ అల్లుకొని ఉంటుంది. ఉన్న బతుకమ్మంటే చెరువు అలల మీద మెలమెల్లగా కదిలి పోయే పూల తేరు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలోని ప్రతి ఊరు వసంత శోభను సంతరించుకుంటుంది. తోవ పక్కన పూసిన పూలన్నీ, అడవిలో విరిసిన పుష్పాలన్నీ ఇంటికి చేరి ‘తాంబాలం’లో గుమ్మడి ఆకుల మీద బుద్ధిగా ఒదిగి కూర్చుంటాయి. తీరొక్క పూవులతో ముస్తాబైన బతుకమ్మను దేవుని గుడి ముందరో, చెరువు కట్ట మీదనో ఉంచి కన్యలందరూ వాళ్ళ తల్లులతో కలిసి కొత్త కోకలు కట్టుకొని ఆ గౌరీ మాతను తమకు పచ్చని జీవితాన్ని ప్రసాదించుమని బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నాజూకైన చేతులతో చప్పట్లు కొడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే అందరికీ బతుకమ్మ పండుగ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ తెడ్లపద్మ, పారామెడికల్ ప్రిన్సిపాల్ బాలక్రిష్ణ,అంజి, హరి జ్యోతి,దశరధరెడ్డి,పెద్దింటి నాగయ్య విద్యార్థులు,రుంజ కళాకారులు పాల్గొన్నారు..