తెలంగాణ పారిశ్రామిక విధానాలపై కెనడా ఆసక్తి
కెటిఆర్‌తో కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్ సమావేశం
హైదరాబాద్,ఫిబ్రవరి11(జనంసాక్షి): టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్ సమావేశమయ్యారు. తెలంగాణలో పారదర్శక పారిశ్రామిక విధానాల గురించి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా సంస్థలకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై నికోల్ గిరార్డ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా గిరార్డ్‌ను కేటీఆర్ సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.