తెలంగాణ పోలీసు మహాద్భుతం

– ఎస్సైనుంచి డీజీపీ స్థాయి అధికారులతో సీఎం సమీక్ష
– వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవాలి
– గ్రేటెస్ట్‌ పోలీస్‌ ఆఫ్‌ ఇండియా అని ప్రశంసలు
హైదరాబాద్‌,మే 19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ,ప్రత్యేతక తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడడంలోనూ పోలీసుల సహకారం ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని సర్వత్రా ప్రశంసలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ వస్తే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువవుతుందని వచ్చిన అపోహలన్నింటినీ పోలీసులు తొలగించారని కొనియాడారు. అటాంటి ఆరోపణలను అన్నింటిని పటాపంచలు చేసిన పోలీసులకు దక్కుతుందన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని, ¬ంమంత్రి వెళ్లిన సందర్భంలో వాళ్లు ప్రశంసించారు. తెలంగాణ పోలీసులు గొప్పపని, యంగెస్ట్‌, గ్రేటెస్ట్‌ పోలీస్‌ ఆఫ్‌ ఇండియా అని మన పోలీసులను దేశవ్యాప్తంగా కీర్తిస్తున్నారని సీఎం అన్నారు. తెలంగాణ పోలీసులు సాధిస్తున్న ఘనత పట్ల సంతోషంగా ఉందని, వారందరికీ హృదయాపూర్వకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులతో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో కేసీఆర్‌ శుక్రవరాం సమావేశం ఏర్పాటుచేశారు. ఎస్‌ఐ నుంచి డీజీపీ స్థాయి అధికారులతో కలిసి సుమారు 1500 మంది పోలీసులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..తాను దిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర పోలీసులు గొప్పవాళ్లని ప్రధాని, ¬ంమంత్రి చెబుతున్నారు. రాష్ట్ర పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పోలీస్‌ శాఖకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మహిళా పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకే ‘ఫ్రెండ్లీ పోలీస్‌’ వ్యవస్థ తీసుకొచ్చాం. పోలీస్‌ శాఖకు 4వేల నూతన వాహనాలు కొనుగోలు చేశాం. అధునాతన వాహనాల కోసం కొత్తగా రూ.500 కోట్లు కేటాయిస్తాం. అధునాతన వాహనాలతో పోలీసుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు.
పోలీసు శాఖకు 500కోట్ల నజరానా
పోలీసు శాఖకు 500 కోట్ల బహూమానం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. కొత్త వాహనాలు, మౌళిక సదుపాయాల కోసం ఆ డబ్బును ఖర్చు చేయాలన్నారు. హైదరాబాద్‌ పోలీసుకు అద్భుతమైన పేరు వచ్చిందన్నారు. చాలా గొప్ప ఫలితాలు తీసుకు వచ్చినట్లు మెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ఓ న్యాయమైన డిమాండ్‌ అని, దానికి విూ సహకారం లభించిందని సీఎం కేసీఆర్‌ పోలీసులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చేసిన ఉపన్యాసాలు విూరు విన్నారు, ఎవరూ ఊహించని రాష్ట్రం కష్టపడి సాధించాం. ఆ లక్ష్యాలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ కీలకమైన వ్యవస్త అన్నారు. రాష్ట్ర సాధనలో పోలీసుల పాత్ర ప్రాముఖ్యమైందన్నారు. రాష్ట్రంలో 806 పోలీస్‌స్టేషన్లు, 716 సర్కిళ్లు, 162 సబ్‌ డివిజన్లు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. అర్హత సాధించిన తక్షణమే పదోన్నతి ఇచ్చే విధంగా వ్యవస్థ తీర్చిదిద్దాలి. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులు పింఛన్‌ కోసం పైరవీ చేసే దుస్థితి ఉండకూడదు. రిటైరైన రోజు పూలమాల, శాలువాతో సత్కరించి.. వాహనంలో ఇంటి వద్దకు చేర్చాలి.’ అని కేసీఆర్‌ అన్నారు. సింగపూర్‌లో మహిళ అర్థరాత్రి ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదనే షీ బృందాలను ఏర్పాటు చేశాం. షీ బృందాలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో గుడుంబా, పేకాట క్లబ్‌, గుట్కా, మట్కాలు పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాం. మొన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరు చెప్పుకునే మేం ఓట్లు అడిగాం. దానికి ప్రజలు స్పందించి 99 సీట్లు గెలిపించారు’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.తెలంగాణ పోలీసులు అద్భుతంగా పేనిచేస్తున్నారు. ఈ పనితీరు ఇంకా మెరుగు కావాలన్నారు. ఎప్పుడూ రిలాక్స్‌ కారాదన్నారు. బెస్ట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ చాలా ముఖ్యమైందన్నారు. ఓ దశ తర్వాత మరో దశ అనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. డీజీపీ, ¬ంమంత్రి కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎస్సై, సీఐ ఎప్పుడూ అప్‌డెట్‌ అయి ఉండాలన్నారు. నేను చెప్పేది రైట్‌ అని విూరంటారనుకుంటానని సీఎం అన్నారు. జోన్ల సమస్యను స్ట్రీమ్‌ లైన్‌ చేయాలన్నారు. డిపార్ట్‌మెంట్‌ హెడ్స్‌కు ప్రమోషన్‌ తప్పక ఇవ్వాలన్నారు. ప్రమోషన్‌ తగిన సమయానికి ఇస్తే అదే బెస్ట్‌ రిఫార్మ్‌ అవుతుందన్నారు. అలా చేస్తే డ్యూటీ గురించి ఆలోచించాల్సిన ఇబ్బంది ఉండదన్నారు. ప్రమోషన్ల అంశంపై ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. మహిళా పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పోలీస్‌ కవిూషనరేట్‌ ఎలా ఉండాలన్న అంశంపై ట్రైనింగ్‌ తీసుకోవాలన్నారు.
సిఎస్‌ అభినందన
తెలంగాణ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్‌ ప్రశంసించారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే లా అండ్‌ ఆర్డర్‌ను రక్షించాలన్నారు. గత మూడేళ్లలో పోలీస్‌ శాఖ అద్భుతమైన ప్రగతి సాధించిందని కొనియాడారు. అది ఇంకా మెరుగు కావాలని సూచించారు. ప్రభుత్వం పోలీస్‌ శాఖకు ఎప్పటికప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని.. అందుకునుగుణంగా పోలీసులు పని చేయాలని సీఎస్‌ ఎస్పీ.సింగ్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి సీఎం పోలీసులతో ముఖాముఖి నిర్వహించారు. పోలీస్‌ సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఇంటరాక్ట్‌ అవుతున్నారని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. సిబ్బంది నియామకంపై గతంలోనే సీఎం కేసీఆర్‌ ఆరా తీసారని.. అందుకు సంబంధించి ఖాళీల వివరాలు అందజేసామన్నారు. ఇప్పటికే గత నోటిఫికేషన్‌తో కొంతమంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకున్నామని డీజీపీ చెప్పారు. ఎస్సై నుంచి డీజీ స్థాయి అధికారులతో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. పోలీస్‌ విభాగం పని తీరు, కొత్త జిల్లాల్లో పరిస్థితులు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ స్వయంగా దిశానిర్దేశం చేస్తారు.
ప్రజారక్షకులుగా పేరు తెచ్చుకోవాలి
పోలీసులు ప్రజారక్షకులన్న పేరు తెచ్చుకోవాలని సిఎం కెసిఆర్‌ సూచించారు. దయచేసి గతంలో ఉన్న చెడు కల్చర్‌కు స్వస్తి పలకాలని, పోలీసులంటే ప్రజను భయపెట్టే విలన్లుగా కాకుండా తెలంగాణ పోలీస్‌ అంటే ప్రజలను రక్షించే హీరోలుగా పేరు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన క్షేత్రస్థాయి అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పోలీసుల్లో మంచి ప్రవర్తన గురించి వారికి తెలియజేశారు. ఈ సమావేశానికి ఎస్‌ఐ స్థాయి నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్‌ మొదటిసారిగా సమావేశమయ్యారు. పోలీస్‌ ప్రమోషన్లలో పైరవీలకు తావుండొద్దని సీఎం కేసీఆర్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వారికి న్యాయంగా రావలిసిన ప్రమోషన్‌ను సమయానికి ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి వ్యక్తిగత కక్షలు, పైరవీలకు తావివ్వొద్దన్నారు. ప్రమోషన్‌ అనేది రావలిసిన సమయానికి వస్తే సంబంధిత అధికారి తన విధులపై దృష్టి పెట్టడానికి అస్కారం ఉంటుందన్నారు. లేకపోతే పనిని పక్కనబెట్టి ప్రమోషన్‌కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని సీఎం వివరించారు. ఢిల్లీ స్థాయిలో పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నా యని చెప్పారు. లంచం తీసుకోకుండా పోలీసులు సేవలు అందించాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఎంతో కీలకమైదని పేర్కొన్నారు. మహిళలకు సదుపాయాలు కల్పించాలని కోరారు. రాయదుర్గం భూముల అమ్మకంతో వచ్చిన డబ్బు పోలీసు శాఖకే ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆధునాతన వాహనాల కొనుగోలు చేసేందుకు రూ. 500 కోట్లు ఇస్తామని తెలిపారు. నగర కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌ పోలీసులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో పోలీసులు మామూళ్లు అడగడం లేదన్నారు. పోలీసుల పేరుతో ఓట్లు అడగడానికి రాజకీయ పార్టీలు భయపడతాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము షీ టీమ్స్‌ బొమ్మలు పెట్టి ఓట్లు అడిగామని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని ఎన్నో సౌకర్యాలు పోలీసులకు తమ ప్రభుత్వం కల్పించిందని కేసీఆర్‌ చెప్పారు.