తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ఈ నెల 27నుండి 29వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా 27న జరుగు మహా ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు కోరారు. బుధవారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సీపీయం, రైతు సంఘం మండల కమిటీల సంయుక్త సమావేశం బట్టిపల్లి సుందరయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, రైతు సంఘం 1936లో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అనేక సమరశీల పోరాటాలు చేసిందని,
జమిందార్, జాగీర్దారుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడింది అన్నారు.  స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కౌలుదారి రైతులకు రుణార్హత కార్డులు ఇవ్వాలని, అనేక రైతు సంఘాలను కలుపుకొని ప్రభుత్వ ల విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. ఈ తరుణంలో నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగు మహా ప్రదర్శన బహిరంగ సభకు అధిక సంఖ్యలో రైతులు  పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల అధ్యక్షులు చందా చంద్రయ్య, మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, కమిటీ సభ్యులు బి నాగయ్య, టి సతీష్, ఆరే  కృష్ణారెడ్డి, విజయలక్ష్మి, ఉదయమ్మ, సీతారాములు,  కనకయ్య, జానికిరెడ్డి, మల్లారెడ్డి, బచ్చలకూర స్వరాజ్యం, వీరబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.