దత్తత గ్రామంలో భువనేశ్వరి పర్యటన
విజయవాడ,అక్టోబర్10(జనంసాక్షి): ఎపి సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బుధవారం దత్తత గ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆరో సారి వచ్చిన ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఆమె నడుచుకుంటూ అందర్నీ పలకరించారు. రూ.55 లక్షలతో పునర్ నిర్మించిన శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.