దళితులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి
-విద్యా సంస్థల బంద్ విజయవంతం
-భారీ బైక్ ర్యాలీ ప్రదర్శన
-పెద్ద ఎత్తున జంక్షన్లలో మానవహారం
-ఎంఎస్పి తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 23(జనం సాక్షి)
దళితులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలని ఎమ్మెస్పీ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ అన్నారు. వరంగల్ తూర్పు లేబర్ కాలనీ తెలంగాణ జంక్షన్లో ఎంఆర్పియస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు అనంతరం భారి బైకు ర్యాలీ తో వెంకటరమణ, కాశీబుగ్గ, పోచమ్మ మైదాన్, ఎంజీఎం, ములుగు రోడ్డు వరకు అక్కడి నుండి ఆటోనగర్, దేశాయిపేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శులు మహమ్మద్ అయూబ్, మీసాల ప్రకాశ్,కాంగ్రెస్ నాయకులు జన్ను వేణు,సందెల లాజర్, నర్మెట్ట చిన్న,టీఆర్ఎస్ నాయకులు బైరపాక డేవిడ్ రాజ్ టీసిఎస్ ఎస్ ఎస్ అధ్యక్షులు రేవ,,ఎంఎస్ రాజు ఈ బంద్ కు సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెస్పి తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల దళిత బాలుడు ఇంద్రకుమార్ మేఘ్వాల్ అందరు విద్యార్థులు తాగే మంచినీళ్ల కుండలో నీళ్లు తాగాడనెే నెపంతో స్కూల్ టీచర్ అమానుషంగా కిరాతకంగా కొట్టి దారుణంగా హింసించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన దేశంలో మానవత్వమున్న ప్రతి మనిషీ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు స్కూల్లో అందరూ తాగే నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా దళితులకు లేదంటే ఈ దేశ కుల వివక్ష అంటరానితనం ఇప్పటికీ దళిత ప్రజల పట్ల ఎలా జరుగుతున్నదో అర్థం చేసుకోవాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్బంగా అంటరానితనం దళిత బాలుడిని హత్య చేస్తే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజువరకు కనీసం ఖండిం చలేదన్నారు. హత్యకు గురైన బాలుడి పట్ల దేశ ప్రధానమంత్రి సానుభూతి లేకపోతే అంటరానిత నాన్ని పాటిస్తున్న, కులోన్మాదులను ప్రధానమంత్రి హెచ్చరిక చేయకపోతే దళితుల మీద అకృత్యాలు ఎట్లా అగుతాయని అన్నారు. కనీసం మానవత్వం లేకుండా ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న తీరు దళితులను మరింత మనో వేదనకు గురి చేస్తోందన్నారు.ఇప్పటికైనా ప్రధానమంత్రి మౌనం వీడి దళితుల మీద దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రక్షణ చట్టాలు బలోపేతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమం లో ఎంఆర్పియస్ జిల్లా కో కన్వీనర్ జన్ను మధుకర్ మాదిగ, ఎంఎస్పి తూర్పు నేతలు కలకొట్ల గిరి మాదిగ, గంగారపు మల్లన్న మాదిగ, కొండ్రా రాజు మాదిగ, మంద రమేష్ మాదిగ,గజ్జి రాజు మాదిగ,కవ్వం పెళ్లి రవి మాదిగ,పెండ్యాల అరుణ్ మాదిగ,పోలేపాక నాని, పోలేపాక ప్రణయ్, గాలి సుదర్శన్,ఎండీ రహీమ్,ఎండీ అమీర్, ఎండీ రహీమ్, వంగ పవన్ పద్మశాలి, కోగిల యాకోబు,కుమ్మరి రాజు,గంగారపు సాయి మాదిగ