దివ్యాంగులకు అండగా సర్కార్: కడియం
వరంగల్,ఆగస్ట్14( జనం సాక్షి ): హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. దివ్యాంగులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కడియం శ్రీహరి అన్నారు. వారి సంక్షేమాభివృద్ధి కోసం రూ.100కోట్లను బ్జడెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ రూ.500 నుంచి రూ.1500కు పెంచామని పేర్కొన్నారు. వారి కోసం వందశాతం రాయితీ రుణాలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని వివరించారు.