దీదీని గెలిపించండి
కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు కుంటా పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.గాయం కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రికే పరిమి తమైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (66) మళ్లీ తన ప్రచారాన్ని ప్రారం భించనున్నారు. కాలికి గాయం ఉండటం తో వీల్‌ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొనసాగిం చనున్నారు. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలో భారీ రోడ్ షో నిర్వహించ నున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం లో మమతా బెనర్జీ కాలికి గాయమైంది. కొందరు వ్యక్తులు కారు డోరును బలంగా తోయడంతో తన కాలికి గాయమైందని దీదీ పేర్కొన్నారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వాల్‌మార్ట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్‌కు ఉపయోగక రంగా ఉంటాయని అన్నారు. వివిధ పంటలకు కనీస మద్దతు ధరకు హావిూ ఇచ్చే చట్టాలను తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ”కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీకి చెందినది అయితే రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేది. కానీ, ఇది బడా వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వం. దేశం మొత్తాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది”అని రాకేశ్ టికాయత్ వ్యాఖ్యానించారు.
దేశమంతా పర్యటిస్తా..
దిల్లీలో తాను ఒక్కడినే ఆందోళన చేయనని, దేశమంతా పర్యటించి రైతులను కలుస్తానని రాకేశ్ టికాయత్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన.. ఈ నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.