దుంపెడ నుండి సిరికొండ జోడు పాదయాత్ర
జనం సాక్షి కథలాపూర్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్రకు సంఘీభావంగా కథలాపూర్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజ్ ఆధ్వర్యంలో దుంపేట నుండి సిరికొండకు జోడో పాదయాత్ర గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పనులకు నిరసనగా జోడో పాదయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జూడో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం పాలన అంతమై వరకు ప్రజలు మన సంతృప్తిగా ఉండారని, రోజురోజు నిత్యవస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని అన్నారు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యవర్గ సభ్యులు అంజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీమ్, జిల్లా నాయకులు వెల్చాల సత్యనారాయణ, కస్తూరి నరేష్, వేములవాడ నియోజకవర్గ యూత్ ఉప అధ్యక్షులు కాశివత్రి వంశీ, గంగాధర్, ఎంపీటీసీ పులి శిరీష హరిప్రసాద్, ఎన్ఎస్ఐ మండల అధ్యక్షుడు ఆకుల సంతోష్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు