దుబ్బాక కు నాలుగు రోజుల్లో మరో కొత్త అంబులెన్స్

దుబ్బాక 07, జూలై ( జనం సాక్షి )
దుబ్బాక మండలంలో అత్యవసర సేవలు అందించడానికి కొత్త అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఐ సి యు) అంబులెన్స్ నాలుగు రోజుల్లో రానుందని దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్ తెలిపారు. దుబ్బాక లో ప్రస్తుతం సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ చాలా పాత వాహనం కావడం వల్ల ఎప్పుడు నడుస్తుందో , ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి గమనించి దుబ్బాక 108 అంబులెన్స్ కొత్త వాహనం ఇప్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు కు జనవరి 1 న వినతి పత్రం ఇవ్వగా ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా దుబ్బాక ప్రజల కోసం కొత్త అంబులెన్స్ ను తన స్వంత ఖర్చులతో ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారము తన పుట్టిన రోజు సందర్భంగా 35 లక్షల రూపాయల స్వంత నిధులతో కొత్త అంబులెన్స్ ను ప్రారంభించారు. అయితే 108 ద్వారానే సేవలు మెరుగ్గా అందుతాయని 108 కు కొత్త అంబులెన్స్ ను అప్పగించాలని నిర్ణయించారు. కాని 108 కు అప్పగించడానికి 3 నెలల సమయం పట్టింది. ఈరోజు అంబులెన్స్ 108 కేంద్ర కార్యాలయానికి చేరింది. అంబులెన్స్ లో కొన్ని పరికరాల బిగింపు తర్వాత నాలుగు రోజుల్లో దుబ్బాక కు కొత్త అంబులెన్స్ రానుంది. దుబ్బాక ప్రజల అత్యవసర వైద్య సేవల కొరకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఐ సి యు ) అంబులెన్స్ ఇచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు కు దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం తరపున ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం ఉపాధ్యక్షుడు మర్గల రాజేష్,  కార్యవర్గ సభ్యులు చారి, అంజిరెడ్డి,శివ,మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area