దుబ్బాక చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలి.

-టి పి ఎస్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు సన్మానం.
– పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రచార  కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు.
దుబ్బాక 07, ఆగష్టు ( జనం సాక్షి )
దుబ్బాక చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చి, ప్రత్యేక హోదాను కల్పించాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రచార  కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, ఆదివారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా దుబ్బాకలో కాడవేర్గ్ చoద్రమౌళి,మంతురి శ్యామవ్వ, రాపెళ్లి జనవ్వా చేనేత కార్మికులను రాష్ట్ర ప్రచార కార్యదర్శి, టిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరాం రామకృష్ణ ప్రభు సన్మానించారు.ఈ సందర్భంగా రామకృష్ణ ప్రభు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు 51 సంవత్సరాలకు పింఛన్,లక్ష రూపాయల వరకు రుణమాఫీ, వర్కర్ టు ఓనర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేటి నుండి చేనేత భీమా పథకంను ఇచ్చి చేనేత కార్మికుల కుటుంబానికి రూ 5 లక్షల భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల వివక్షను ప్రదర్శించి నేషనల్ హ్యాండ్ లూమ్ బోర్డు ను రద్దు చేయడం,నేసిన వస్త్రాలపై 15 శాతం జిఎస్టీ విధించి, అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిన ఘనత మోడీకె దక్కిందని టి పి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు రాపెళ్లి నాగరాజు, అజ్జ నాగయ్య,కురపాటి బాలరాజు, జిoదం మల్లేశం, రాములు,అజ్జ అంబదాస్ ,మంచే రాజయ్య,బిల్ల శ్రీను,బిల్ల రాజు,తుమ్మ సత్యం చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.