దుబ్బాక సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
దుబ్బాక 28, జూలై ( జనం సాక్షి )
ఈ సందర్భంగా కమిషనర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. దుబ్బాక సర్కిల్ చుట్టూ పరిసరప్రాంతాలు గత సంవత్సరం హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మరియు 5ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5ఎస్ ఇంప్లిమెంటేషన్ పూర్తి చేయాలని సూచించారు. సర్కిల్ కార్యాలయంలో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు, గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి, మరియు గ్రేవ్ కేసెస్ లలో అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, పరిశీలించారు. గ్రేవ్ కేసులలో ఫోక్సో కేసులలో నేరస్తులకు నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి పెండింగులో ఉన్న కేసులను ఛేదించాలని సూచించారు. సిసీటిఎన్ఎస్ (క్రైమ్ మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్& సిస్టం) ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచాలని సూచించారు, అధికారులు ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ ఎం. కృష్ణ, దుబ్బాక ఎస్ఐ మహేందర్, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area