దేవరకొండలో ఇప్పటివరకు ‘ ఆర్ ‘ … ‘ బి ‘లదే గెలుపు.

దేవరకొండ అక్టోబర్ 6 జనం సాక్షి

దేవరకొండ శాసనసభ నియోజకవర్గం 1978లో ఎస్టీలకు రిజర్వు కాబడింది.అప్పటినుండి ఇప్పటివరకు 11 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఒకసారి ఉప ఎన్నిక జరిగింది . గడచిన 45 ఏళ్ల ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా వెలుగొందిన అందరి పేర్లలో మొదటి అక్షరం ‘ఆర్’
లేదా ‘బి’ తో మొదలైన వారే ఉండడం విశేషం. ఎస్టీ రిజర్వ్ కోటాలో మొదటిసారి 1972-78 లో బొడ్డుపల్లి రమాశంకర్ కమ్యూనిస్టు పార్టీ నుండి గెలుపొందారు. 1978-83,1983-85లలో ‘ వరుసగా రెండు పర్యాయాలు రవీంద్ర నాయక్ ధరావత్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించడం జరిగింది.1985-89,1989-94,1994-99 లలో కమ్యూనిస్టు పార్టీ నుండి
బద్దూ చౌహాన్ మూడవత్ హ్యాట్రిక్ తో విజయ డంక మోగించారు.1999-2002 లో కాంగ్రెస్ పార్టీ నుండి ‘ ‘రాగ్య నాయక్ ధీరావత్ గెలుపొంది 2002-04 లో జరిగిన ఉప ఎన్నికల్లో రాగ్య నాయక్ సతీమణి భారతి రాగ్య నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.2004-09 లో రవీంద్ర
నాయక్ రమావత్ కమ్యూనిస్టు పార్టీ నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009-14 లో జరిగిన ఎన్నికల్లో బాలు నాయక్ నేనావత్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. ఆ తర్వాత
2014-18 కమ్యూనిస్టు పార్టీ నుండి గెలుపొందిన రమావత రవీంద్ర కుమార్ 2018 ఎన్నికలో’ టిఆర్ఎస్ పార్టీలో చేరి రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఈ విధంగా ఇప్పటివరకు ఆర్ ….బి అక్షరాలతో మొదలయ్యే పేర్లు తప్ప మినహా హర్యా నాయక్, విజయలక్ష్మి , శక్రు నాయక్, వశ్య నాయక్ తదితరులు సమీప పోటీ అభ్యర్థులుగా ఉండి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. అది పేరు బలమా లేక మరో కారణమా. 2023 ఎన్నికల్లో కూడా ఏ అక్షరంతో మొదలయ్యే వారు నెగ్గుకొస్తారో వేచి చూడాలి మరి…!