దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్


కొండమల్లేపల్లి ఫిబ్రవరి 15 (జనంసాక్షి) న్యూస్ :
ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం కొండమల్లెపల్లి పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…..సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజన ఆరాధ్య దైవం కాదు అని,అందరి ఆరాధ్య దైవం అని అన్నారు 300 ఏళ్ల క్రితమే మనం ఎలా జీవించాలో చెప్పిన గొప్పవారు సంత్ సేవాలాల్, కానీ దురదృష్టవశాత్తు అన్ని తెలిసి కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ చెప్పినవి పాటించడం లేదు అని అన్నారు.సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత ఉంది అని అన్నారు లంబాడా జాతిలో పూజలు చేసే విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు గిరిజనుల జాతిని జాగృతం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని స్వరాష్ట్రంలో గిరిజనుల వికాసం సాధించాలనే గొప్ప సంకల్పంతో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. స్వయం పరిపాలన విధానాన్ని అమలు చేసి గిరిజనులకు రాజ్యాధికారం దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న తొలిరాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అంతేగాకుండా, సేవాలాల్ జయంతి వేడుకల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసి గిరిజనులపై ఉన్న ప్రేమ,అభిమానులను చాటుకుందని అన్నారు. ప్రతీ గిరిజనుడు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో పయనించాలని కోరారు బంజారాలు అంటే నాడు బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతులు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరు యుగేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్, ఉప సర్పంచ్ గంధం సురేష్, ముడవత్ పాండు, రమావత్ తులిసిరామ్, బోడ్డుపల్లి కృష్ణ,నేనావత్ శంకర్ నాయక్,రమావత్ శివ,అర్జున్, రమావత్ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.