దేవూరి శేషగిరిరావు వర్థంతి వేడుకలు

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతిని ఘనంగా జరిపారు. గురువారం ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన
కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్, ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి కందుకూరు రాజారత్నంలు కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకల్లో ఒకరైన కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు సింగరేణిలో కార్మికులకు చేసిన సేవలను కొనియాడుతూ, ‌ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి హక్కు లేని తరుణంలో చిన్న పిల్లలను మహిళలను సైతం బొగ్గు గనులు దింపి పనిచేస్తున్న క్రమంలో బానిస వ్యవస్థను చూసి చలించిపోయి వారికి అండగా నిలిచి కాంట్రాక్టీకరణకు నైజాంకు వ్యతిరేకంగా,తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా అమరజీవి అన్నారు.
చిన్ననాటి నుండే కమ్యూనిస్టు భావాలతో పెరిగిన శేషగిరి రావు అన్యాయాలను చూసి మనసు చెలించి శేషగిరిరావు సింగరేణిలో ఒక సంఘం ఉండాలని నాయకులైన ముగ్ధం మోహినుద్దీన్ డాక్టర్ లాల్ బహదూర్ గౌడ్ తో 1942 లో కలిసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ను సింగరేణిలో స్థాపించారని తెలిపారు.
దేవుడి శేషగిరిరావు వివిధ సమస్యల మీద పోరాటాలకు సిద్ధమయ్యారు సింగరేణిలో కాంట్రాక్టు కార్మిక విధానాన్ని నిలిపివేతకు మైన్ లో రక్షణ చర్యలు మీద ,జీతం పెరుగుదల మీద, మహిళ కార్మికులు గని ఉపరితలం మీద పని చేయడానికి, బాల కార్మిక వ్యవస్థను రద్దు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారని వారి ఆశయ సాధన తో సింగరేణి కాపాడుకోవడం కోసం ప్రైవేటీకరణకు మరియు కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పోరాట కార్యక్రమంలో కార్మికులంతా కలిసి రావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ అన్నారావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి బుర్ర తిరుపతి, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శాంసన్, నాయకులు గంధం సాంబశివరావు, వెంకటేశ్వర్లు, బండారి శ్రీనివాస్, సంపత్, రజాసాగర్, నారాయణ, అల్లి రమేష్, అశోక్,రాజకుమార్, బెగ్గం రమేష్, రాజేంద్రప్రసాద్,రాజు, రాంపండిత్ బాబు, సాయి కృష్ణ, అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.