దేశవ్యాప్తంగా 360 మంది ఐటీ కమిషనర్ల బదిలీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇన్‌కంటాక్స్‌ కమిషనర్లకు షాక్‌లాంటి వార్త ఇది. దేశవ్యాప్తంగా ఒకే దెబ్బకు 360 మంది ఆదాయపు పన్ను శాఖ కమిషనర్లను బదిలీ చేసినట్లు డీఎన్‌ఐ వెబ్‌సైట్‌ ఒక వార్తను ప్రచురించింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు-ఐఆర్‌ఎస్‌లో కమిషనర్‌ ర్యాంకు ఉన్న వారిలో బదిలీ ఈయిన వారి సంఖ్య దాదాపు 50శాతం ఉంటుంది. ఉన్న ఫళంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం-సీబీడీటీ ఇంతమందికి బదిలీ చేయడం ఆదాయపు పన్ను శాఖ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి లోను చేస్తుంది.
ఇంటర్నేషనల్‌ ట్యాక్స్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ అనే రెండు విభాగాల్లో పని చేస్తున్న కమిషనర్లను సాధారణంగా బదిలీ చేయరు. అలాంటిది వీరిలో 10 మందికి పైగా కమిషనర్లను ఒకేసారి బదిలీ అయిన వారిలో వొడాఫోన్‌ ట్యాఖ్స్‌ కేసు, షెల్‌ ఆయిల్‌ కంపెనీ లాంటి ప్రతిష్ఠాత్మక ఐటీ కేసులను చూస్తున్న కమిషనర్లు కూడా ఉన్నారు.
ఇలాంటి కేసుల నుంచి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్‌ చేస్తున్న ట్యాక్స్‌ విలువ దాదాపు 68 వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఇంత పెద్ద కేసులను డీల్‌ చేస్తున్న వారిని బదిలీ చేయడం ద్వారా ఏ కమిషనర్‌ ఏ పోస్టులోనూ శాశ్వతంగా ఉండరని విషయాన్ని గుర్తుంచుకోవాలని సంకేతాన్ని సీబీడీటీ ఇచ్చింది.