దేశానికి ఆదర్శంగా వైద్యరంగం: లక్ష్మారెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): మన రాష్ట్ర వైద్యరంగ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రంగానికి నిధులు కేటాయించి, ఆస్పత్రులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ అవిూర్ పేటలోని ప్రకృతి చికిత్సాలయంలో ఏర్పాటు చేసిన కాటేజ్ ట్రీట్‌మెంట్ బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. అవిూర్‌పేట ప్రకృతి చికిత్సాలయానికి దేశంలోనే ప్రఖ్యాతి ఉంది. అనంతగిరి హిల్స్‌లో మరింత ఆధునికంగా ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు అవుతున్నది. ఈ కార్యక్రమంలో పర్యాద కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.