దేశ వ్యాప్తంగా కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిన టాటా మోటార్స్
ఖైరతాబాద్ : సెప్టెంబర్ 26 (జనం సాక్షి) టాటా మోటార్స్ భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ యోధా 2.0 ఇంట్రా వి 2O బై – ఫ్యూయల్, ఇంట్రా వి 50 ఆవిష్కరణలతో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పికప్ విభాగంలో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. ఈ సందర్బంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ.. టాటా వారి చిన్న వాణిజ్య వాహనాలు మిలియన్ల మంది వినియోగదారులకు జీవనోపాధిని, విజయాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందాయన్నారు. అర్బన్ సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో అనేక రకాల ఉపయోగాలను సమర్ధవంతంగా అందించడానికి నిశితంగా రూపొందించ బడిందన్నారు. ఈ ఆధునిక యుగపు పికప్ల ప్రారంభం మరింత పురోగతి, విజయాన్ని అందించడానికి వినియోగదారులను ఎల్లప్పుడూ శక్తివంతం చేయడానికి, అత్యుత్తమ తరగతి వాహనాలతో సన్నద్ధం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు.