దైవదర్శనం కోసం అంతా ప్రాణాలు తీసుకున్నారు

జైపూర్‌ : ఆధునిక కాలంలోనూ ఓ మూఢ నమ్మకం ఓ కుటుంబంలోని ఐదుగురి ప్రాణాలు తీసుకుంది. స్వర్గంలో శివుడిని చూడాలనే కోరికతో కుటుంబ సభ్యులు విషం తీసుకున్నారు. దీంతో కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తాకథనం ప్రచురితమైంది. ఈ సంఘటన సోమవారం రాత్రి గంగాపూర& నగరంలోని సవాయ్‌ మోధోపూర్‌లో జరిగింది.
కుటుంబంలోని ఎనిమిది మంది సైనైడ్‌ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిలో 10,16 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు కూడా ఉన్నారు. వీరిలో ఐదుగురు మరణించగా, ముగ్గురు ఆస్పత్రిలో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యక్తిగత కెమెరాలో మొత్తం సంఘటనను చిత్రీకరించిన వైనం చూసి పోలీసులు బిత్తరపోయారు.
జీవించి ఉండగా శివుడిని చూడలేకపోయామంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న వైనం క్లిప్పులో రికార్డైంది. దేవుడిని సంతృప్తి పరచడానికి హోమం చేశారు. అందుకు రక్తాన్ని, రక్తంపూసిన సరుకులను వాడారు. ఈ రకంగా ఆహుతి నిర్వహించి దేవుడిని స్వర్గంలో కలుసుకోనిడానికి విషం మింగారు.
కాంచన్‌ సింగ్‌ అనే 45 ఏళ్ల వ్యక్తి ఇంటిలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారని ఓ జాతీయ మీడియా రాసింది. అతీతశక్తులపై విశ్వాసంతో అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రాణాలతో శివుడిని కలుసుకోవడానికి ఆహుతి నిర్వహించాడు.
కాంచన్‌ సింగ్‌ భార్య (40). తల్లి భగవతీ దేవి. కూతురు డ్రీమీ (16). కుమారుడు ప్రద్యుమన్‌(11). అతని తమ్ముడు దీప్‌ సింగ్‌ (40) దీప్‌ సింగ్‌ కుమారుడు లవ్‌ సింగ్‌ (10). కాంచన్‌ సింగ్‌ బంధువు రష్మి. విషం తీసుకున్నవారిలో ఉన్నారు. అవ్‌ సింగ్‌. భగవతీదేవి. రష్మీ. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంచన్‌ సింగ్‌ ప్రీలాన్స్‌ జర్నలిస్టుగా పనిచేసేవాడని తెలుస్తోంది.
కాంచన్‌ సింగ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బిగ్గరగా నవ్వుతున్న దృశ్యాలతో పాటు. గత ఐదేళ్లుగా శివుడి విగ్రహాన్ని 3100 సార్లు రక్తంతో అభిషేకం చేసిన విషయం కాంచన్‌ చెబుతున్న విషయం వీడియో రికార్డు అయి ఉంది. రక్తాన్ని శరీరాల నుంచి తీయడానికి ఇంజెక్షన్‌ వాడుతూ వచ్చారు. హోమం చేసిన తర్వాత శివుడు కనిపించకపోవడంతో స్వర్గంలో అతన్ని కలుసుకోవడానికి వారు ఆత్మబలిదానానికి బడిగట్టారు.