దొంగ అరెస్ట్ సొత్తు స్వాధీనం.

తాళం వేసిఉన్న ఇంటిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని మల్కాజిగిరి డిసిపి రక్షితా మూర్తి తెలిపారు.మల్కాజిగిరి డిసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఆధారంగా నేరానికి పాల్పడ్డ నిందితుడిని  పశుపతి శ్రీరాములు అలియాస్ కిన్నెర శివరాం గా గుర్తించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్నూల్ జిల్లా కు చెందిన శ్రీరామ్ సుమారు 25 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపాడని చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నడు, 1990లో దొంగతనం చేసి మొదట మహంకాళి పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డడు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేకచోట్ల దొంగతనాలు చేశాడని విచారణలో వెల్లడైంది.ఇతని వద్దనుండి 14 లక్షలు విలువజేసే 25 తులాల బంగారు ఆభరణాలు,500 గ్రాముల వెండి ఆభరణాలు,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.