దౌల్తాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు
జూలై 15 జనం సాక్షి.ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని దౌల్తాబాద్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ లో శుక్రవారం రోజున గోరింటాకు సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఆర్యవైశ్య మహిళలు మాట్లాడుతూ ఆషాడ మాసంలో మహిళలు చేతులకు మైదాకు పెట్టుకోవడం ఆనవాయితీ అని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మైదాకు ఆషాడ మాసంలో అమ్మవారు ఇచ్చే ప్రసాదంగా మైదాకును స్వీకరిస్తారని, తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుండే సంకృతి సంప్రదాయాలు భక్తి చేత్రలు శ్రద్ధలు పెద్దలపట్ల గౌరవం నేర్పించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి, జిల్లా ఉపాధ్యక్షురాలు గంప మమత, దౌల్తాబాద్ ఆర్యవైశ్య మండల మహిళా విభాగంఅధ్యక్షులు పసుపు నూరి పద్మ, ప్రధాన కార్యదర్శి ఐత శ్రావణి, శ్రీరామ్ అరుణ,జిల్లా రమ,జిల్లా భాగ్యలక్ష్మి, సముద్రాల పుష్పవతి, దౌల్తాబాద్ ఆర్యవైశ్య మహిళలు మహిళలు పాల్గొన్నారు



