ద్రవ్యపరపతి విధానంపై ఆర్‌బీఐ సమీక్ష

న్యూఢిల్లీ : భారత రిజర్వు బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధానంపై సమీక్షించింది. రూపాయి పతనం, ఆహార ద్రవ్యోల్బణం అంశాలపై అందోళన వ్యక్తం చేసింది. కీలక వడ్డీరేట్లు, నగదు నిల్వల నిష్పత్తిపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయిం తీసుకుంది. ప్రవేటు రంగ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించాలని అభిప్రాయపడింది. వృద్ధిరేటు పెంచేందుకు కొత్త ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని ప్రభుత్వానికి సూచింది. తగ్గుతున్న ద్రవ్యోల్బణం ద్రవ్య నియంత్రణ చర్యలకు వూతమిస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది.