ద్రౌపది ముర్ము ఎన్నికపై బీజేపీ సనత్ నగర్ పరివార్ హర్షం

ఖైరతాబాద్ : జూన్ 22 (జనం సాక్షి)  ఝార్ఖండ్ మాజీ గవర్నర్ మరియు గిరిజన మహిళా నాయకురాలు ద్రౌపది ముర్మును ఎన్ డీ ఏ మిత్ర పక్షాల అభ్యర్థిగా బరిలోకి దింపడం బీజేపీకి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల గల చిత్తశుద్ధిని తెలియచేస్తుందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అచిన్ సురేష్, తాళ్ల జై హింద్ గౌడ్ అన్నారు. బుధవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో దిశ కమిటీ సభ్యులు, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సింగ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇదివరకే ఈ నెల 6 వ తేదీన తమ అభిప్రాయంగా వేలిబుచ్చామన్నారు. దీక్షాదక్షత కలిగి భారత అత్యన్నత పదవికి వన్నె తేగల మహిళా అభ్యర్థిగా ఎన్.డీ.ఏ మిత్ర పక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రి అంచనాలను నిలబెడతారని తెలంగాణ బీజేపీ సనత్ నగర్ పరివార్ సభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, సీనియర్ నాయకులు ఉత్తమ కుమార్ రాజ్ పురోహిత్, ఆకూరి శ్రీనివాస్ రావు, వై.శ్రీనివాస్ రావు, సుధాకర్ ముదిరాజ్, ప్రవీణ్ గౌడ్, దశరథ్ గౌడ్, పి.లక్ష్మణ్, బివి.పురుషోత్తం గౌడ్, ఆయిల శ్రీనివాస్, మల్లిఖార్జున్ గౌడ్, సివి.శ్రీనివాస్, రమేష్, పొలిమేర సంతోష్ కుమార్, అమరం శ్యాం, తేజో విజయ్ లు అభిప్రాయపడ్డారు