ధనలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం

 

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతిదేవికి ధనలక్ష్మి దేవి అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఐదవరోజు ధనలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపురం, కొండపేట, యాక్తాపూర్, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, కొండేరు తదితర గ్రామాల నుంచి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ ఉన్న శివాలయం, శ్రీ కోదండరామస్వామి, అభయ ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు.