ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు :

ఎల్బీనగర్  నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి
తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట
 ఎల్బీనగర్ (జనం సాక్షి )ణి పోర్టల్,రుణమాఫీ,రైతు భీమా,రైతు బంధు,పోడు భూముల బాధితుల సమస్యలపై టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  పిలుపు మేరకు  ఎల్బీనగర్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి నిరాహార దీక్షలో కూర్చున్నారు,ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎల్బీనగర్  నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి , జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మల్ రెడ్డి రాంరెడ్డి   మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,ధరణి పోర్టల్ వల్ల రైతు భీమా  రైతు బంధు పధకాలలో కూడా అన్యాయం జరుగుతుంది అని తెలిపారు.ధరణి పోర్టల్ యొక్క సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి వచ్చిన వెంటనే ధరణి ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా పోడు భూముల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న*
 సంకేపల్లి సుధీర్ రెడ్డి, సుజాత రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మకుటం సదాశివుడు, కుట్ల నరసింహ యాదవ్, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మెరుగు రమేష్ రెడ్డి, ఎస్సీ సెల్ రాజశేఖర్, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, శరత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అరుణ్, శ్రీధర్ గౌడ్, రోహిత్, నారాయణ, మంజులా రెడ్డి, సౌమ్య రెడ్డి, రాజేశ్వరి, భాను, గీత, మాధవి,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.