ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం
-సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయి త ప్రకాశ్ రెడ్డి
భూపాలపల్లి టౌన్ ఆగస్టు 25 (జనంసాక్షి)
ప్రజలకు అవసరమైన నిత్య అవసరాల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విఫలం చెందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ అధిక ధరల నియంత్రణ లేక విలువలాడుతున్న దేశ ప్రజలకు అండగా ఎఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు తరలిరావాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయి త ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉధృతం కావడంతో ఈనెల 28న నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4 న నిర్వహిస్తున్నామని తెలిపారు.
పార్టీ కోసం పని చేసే ప్రతి వారు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమం ముగిసే వరకు అధిష్టాన ఆదేశాల మేరకు పనిచేయాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ప్రజలను మభ్య పెట్టేందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప లోపటికి రెండు పార్టీలు ఒకటేనని దూయబెట్టారు.తెలంగాణ విభజనలో చట్టంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం కోచ్ ఫ్యాక్టరీ లాంటి వాటిపై ఏ ఒక్కరోజు గొంతు విప్పని ప్రభుత్వాలు ఉండి కూడా లేనట్టేనని అన్నారు.కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేసి బిజెపి లో చేర్చుకొని ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకే బిజెపి పార్టీ సంగ్రామ యాత్ర నిర్వహిస్తుందని అన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పయనించే పార్టీ దేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, భూపాలపల్లి రూరల్ అధ్యక్షులు సుంకరి రామచంద్రయ్య,గూట్ల తిరుపతి, రేపాక రాజేందర్, ఆకుతోట కుమారస్వామి, ఇప్పకాయల నరసయ్య, బడితల రాజయ్య, అక్బర్ ఖాన్, పక్కల సడవలి, లేళ్ల చిన్నన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుకోట రాజబాబు, వెంపటి భువన సుందర్, బండి సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.