ధర్మపురిలో జర్నలిస్టుల నిరసన!

ధర్మపురిలో జర్నలిస్టుల నిరసన!

ధర్మపురి (జనం సాక్షి))జగిత్యాల జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో తహశీల్దార్ కు విలేకర్ల సమస్యలను పరిష్కరించాలని సోమవారం గాంధీ జయంతి సందర్భంగా వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ధర్మపురి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మహాదేవ్, సభ్యులు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయంకు తరలి వెళ్లారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును, వివక్షత డిమాండ్ల సాధన కోసం 9 సంవత్సరాలుగా ఆందోళన, ధర్మాలు జర్నలిస్టు చేస్తున్న పట్టించుకోవడంలేదని, ప్రింట్, ఎలక్ట్రానిక్, లోకల్ ఛానల్ సభ్యులు నినాదాలు చేశారు. అదనంతరం ఐజేయూ జాతీయ సభ్యుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ,దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి, మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలి, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి
గాంధీ జయంతి రోజున ఇండియన్ జర్నలిస్ట్స్ హక్కుల సాధనకై చేసిన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమములో సీనియర్ జర్నలిస్టు రామక్రిష్టయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కర్నె .సంతోష్, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గ యూనియన్ అధ్యక్షుడు క్యాదసు స్వామి, మురళి, శంకర్, రమేష్, S. అశోక్ , శ్రీరాములు, S.శ్రీనివాస్ , పెద్దన్న, సుధీర్, వరప్రసాద్, వినయ్ , బుగ్గారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్,
నరేష్, M. శ్రీనివాస్, బాబు కుమార్, ప్రవీణ్, సతీష్ తదితరలు సభ్యులు,డిమాండ్ల ప్లే కార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.